Google Layoffs: గూగుల్ ఉద్యోగులకు లేఆఫ్స్‌ గండం.. పెర్ఫామెన్స్ సరిగా లేకపోతే అంతే సంగతులు..

Google Layoffs: గూగుల్ ఉద్యోగులపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలోనైనా భారీగా ఉద్యోగులను తొలగించుకునేందుకు గూగుల్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 16, 2022, 01:50 PM IST
  • గూగుల్ ఉద్యోగులకు లేఆఫ్స్ టెన్షన్
  • భారీగా ఉద్యోగులను తొలగించుకునే అవకాశం
  • లేఆఫ్స్‌పై ఇప్పటికే ఉద్యోగులకు వార్నింగ్
Google Layoffs: గూగుల్ ఉద్యోగులకు లేఆఫ్స్‌ గండం.. పెర్ఫామెన్స్ సరిగా లేకపోతే అంతే సంగతులు..

Google Layoffs: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులను లేఆఫ్స్ టెన్షన్ వెంటాడుతోంది. ఫలితాలు చూపించండి.. లేదా కంపెనీని వీడేందుకు సిద్ధంగా ఉండండి అంటూ గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగులకు వార్నింగ్ జారీ చేశారు. కంపెనీలో ఉద్యోగులు ఎక్కువైపోయారు.. కానీ వారికి తగినంత పనిలేదు అంటూ ఇటీవల గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా లేఆఫ్స్‌ ఉండొచ్చుననే వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. పని తీరు మెరుగుపరుచుకోవాలని, మరింత సమర్థవంతంగా పనిచేయాలని సుందర్ పిచాయ్ ఉద్యోగులకు సూచించారు.

బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం.. అటు సీఈవో వ్యాఖ్యలు, ఇటు ఎగ్జిక్యూటివ్స్ వార్నింగ్‌తో గూగుల్ ఉద్యోగుల్లో లేఆఫ్స్ టెన్షన్ నెలకొంది. పెర్ఫామెన్స్ మెరుగుపరుచుకోని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా సాగనంపే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే లేఆఫ్స్ ఉండేది లేనిది వచ్చే త్రైమాసికంలో గూగుల్ ఆదాయానికి సంబంధించిన రిపోర్ట్‌పై ఆధారపడి ఉండొచ్చునని సంస్థ ఎగ్జిక్యూటివ్స్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గూగుల్‌ క్లౌడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి ఉద్యోగులకు లేఆఫ్స్ వార్నింగ్ అందినట్లు చెబుతున్నారు. సేల్స్ ప్రొడక్టివిటీ విషయంలో అంచనాలను చేరుకోలేకపోతే, వచ్చే త్రైమాసికంలో సరైన ఫలితాలు రాకపోతే లేఆఫ్స్ తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే గూగుల్ యాజమాన్యం నుంచి లేఆఫ్స్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ టెక్ కంపెనీలు 2 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను సాగనంపాయి. ఇప్పుడు గూగుల్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతోంది. దీంతో లేఆఫ్స్ గండం ఎలా గట్టెక్కాలా అని ఉద్యోగులు తలపట్టుకున్నారు. 

Also Read : Bihar Cabinet: బీహార్‌లో నేడు కొలువదీరనున్న కొత్త కేబినెట్.. ఆర్జేడీకి 16, జేడీయూకి 11 కేబినెట్ బెర్తులు..!

Also Read: National Anthem: తెలంగాణలో ఉదయం 11.30 గంటలకు ఎక్కడికక్కడే బంద్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News