Today Gold Rate: దసరా రోజు భారీ షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంత ఉందంటే..

Gold Price Today: బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. దసరా రోజు అయిన గోల్డ్ ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యుడికి నిరాశే మిగిలింది. తులం బంగారంపై రూ.500 మేర పెరిగింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 5, 2022, 07:01 AM IST
Today Gold Rate: దసరా రోజు భారీ షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంత ఉందంటే..

Gold Price Today: దసరా రోజు బంగారం కొనుగోలు చేద్దామనుకున్న వారందరికీ బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు ఇవాళ కూడా అదే బాటలో పయనించాయి. మరోసారి సామాన్యుడిని షాక్ కు గురిచేశాయి. ఇవాళ దేశంలో తులం బంగారంపై రూ. 500 మేర పెరిగింది. వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. స్వల్పంగా పెరుగుదల కనిపించింది. మరి విజయదశమి రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవి మార్కెట్లో ఉదయం ఆరు గంటలకు నమోదైన రేట్లు అని వినియోగదారులు గుర్తించుకోండి. 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
 >> దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,500 కాగా, 24 క్యారెట్లు రూ. 51, 820గా ఉంది.
 >>  ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 47,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,660 గా ఉంది.
 >>  చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,100 వద్ద కొనసాగుతోంది.
 >> బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ. 47,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,710 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్..
 >> హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 47,350 గా ఉండగా, 24 క్యారెట్స్‌ రూ. 51,660 వద్ద కొనసాగుతోంది.
 >> విజయవాడలో మంగళవారం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 51,660 గా ఉంది.
 >> విశాఖపట్నంలో 22 క్యారెట్స్‌ గోల్డ్ ధర రూ. 47,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్లు రూ. 51,660గా ఉంది.

Also Read: Post Office Scheme: అద్భుతమైన పోస్టాఫీసు పథకాలు, ప్రధాని మోదీ పెట్టుబడి పెట్టిన పథకాలివే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News