Todays Gold Rate February 21,2022: దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate : బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వివిధ కారణాలతో బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2022, 07:57 AM IST
Todays Gold Rate February 21,2022: దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate : బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వివిధ కారణాలతో బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు,  కరోనా మహమ్మారి, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు వంటివి ప్రధానంగా బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల180 రూపాయలుగా ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 990 రూపాయలుంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల180 రూపాయలుంది. ఇక చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో ( Hyderabad Gold Rate) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేల 990 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేల 180 రూపాయలుగా ఉంది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలో కూడా ప్రతిరోజూ మార్పు చోటుచేసుకుంటోంది. దేశవ్యాప్తంగా వెండి ధర కిలోకు 7 వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 70 వేలుంది. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర 64 వేలుగా ఉంది. 

Also read: Free fire: ఈ సారి ఫ్రీ ఫైర్ వంతు- గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్ వేటు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News