Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు

Gold Rate Update 10th December 2020: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. మరోవైపు వెండి ధర కేవలం 8 రోజుల వ్యవధిలో రూ.9000 మేర పెరిగింది.

Last Updated : Dec 10, 2020, 07:55 AM IST
  • తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధర
  • దేశ రాజధానిలో స్థిరంగా పసిడి ధరలు
  • వెండి ధరలు భారీగా పతనమయ్యాయి
Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు

Gold Price Today 10Th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర కేవలం 8 రోజుల వ్యవధిలో రూ.9000 మేర పెరిగింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Rate Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.330 మేర దిగిరావడంతో 10 గ్రాముల ధర రూ.50,500 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గడంతో 10 గ్రాములకు రూ.46,300కి క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేటి మార్కెట్‌లో బంగారం ధరలలో ఎలాంటి మార్పులేదు. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల ధర రూ.53,180గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,420గా కొనసాగుతోంది.

Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

బులియన్ మార్కెట్‌లో గత నెలలో తగ్గిన వెండి ధరలు తాజాగా  డిసెంబర్ నెలలో పుంజుకుంటున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.1,100 మేర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.64,400కి దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర ఏకంగా రూ.1,500 మేర తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.68,000కి పతనమైంది.

Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు  

Also Read : Rise in Prices: టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు షాక్.. త్వరలో భారీగా పెంపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News