Gold Price Today 9 November 2022, Gold Rate decresed 3 consecutive days: గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. వరుసగా మూడోరోజు పసిడి ధర తగ్గింది. బుధవారం (నవంబర్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,800లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.110 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి.
నవంబర్ 7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100 తగ్గింది. నవంబర్ 8న కూడా రూ. 10ఓ తగ్గింది. నేడు కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100 తగ్గింది. మొత్తంగా ఈ మూడు రోజుల్లో కలిపి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 300లకు పైగా తగ్గింది. నవంబర్ 7న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,000లుగా ఉంది.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,200గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,580గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,900 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,850గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,100గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,050గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800.. 24 క్యారెట్ల ధర రూ. 51,050గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,050 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. బుధవారం (నవంబర్ 9) దేశీయంగా కిలో వెండి ధర రూ. 60,850లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 450 పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ముంబైలో కిలో వెండి ధర రూ. 60,850లుగా ఉండగా.. చెన్నైలో రూ. 66,700లుగా ఉంది. బెంగళూరులో రూ. 60,850గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 66,700ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Delhi Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. ముగ్గురు మృతి! ఢిల్లీలో భారీ ప్రకంపనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి