Gold Price Today 24 September: పండగ ముందు మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!

Gold Price Today 24 September 2022, Today Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,730గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 24, 2022, 06:52 AM IST
  • పెరిగిన బంగారం ధర
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today 24 September: పండగ ముందు మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!

Gold Price Today 24 September 2022: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు తగ్గిన విషయం తెలిసిందే. అయితే తగ్గిన బంగారం ధరలు.. దసరా పండగ ముందు పెరుగుతున్నాయి. శనివారం (సెప్టెంబర్‌ 24) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 46,500లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 500.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 530 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,890గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,730గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,930 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,550గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,730గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,730గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,730గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,500.. 24 క్యారెట్ల ధర రూ. 50,730గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 46,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,730 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. నేడు వెండి భారీగా తగ్గింది. శనివారం (సెప్టెంబర్ 24) దేశీయంగా కిలో వెండి ధర రూ. 56,800లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 1200 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 56,800లుగా ఉండగా.. చెన్నైలో రూ. 62,500లుగా ఉంది. బెంగళూరులో రూ. 62,500గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 62,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 62,500ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: తండ్రి కోసం తరలి రానున్న తనయులు.. కర్నూల్ ఈవెంట్ కోసం స్పెషల్ ప్లాన్స్!

Also Read: God Father Re Shoot: సెన్సార్ అయ్యాక గాడ్ ఫాదర్ రీ షూట్.. ఇదేదో తేడాగా ఉందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News