Gold Price Today: తగ్గిన బంగారం ధరలు..  వెండి ధర పైపైకి

Gold Price Today In India On 29th October 2020 |  బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం పుంజుకున్నాయి. తాజాగా వెండి ధర రూ.300 మేర పెరగడంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,400కి చేరుకుంది.

Last Updated : Oct 29, 2020, 06:53 AM IST
  • బులియన్ మార్కెట్‌లో తాజా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి
  • వెండి ధర రూ.300 పెరిగి 1 కేజీ ధర రూ.62,400కి చేరుకుంది
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు..  వెండి ధర పైపైకి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు మాత్రం పుంజుకున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.160 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,060కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.140 తగ్గడంతో ధర రూ.47,8730కి పతనమైంది.

 

నాలుగు రోజుల తర్వాత నిన్న ఢిల్లీ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు (Gold Rate in Delhi) తాజాగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.100 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.53,000కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.100 మేర తగ్గి 10 గ్రాముల ధర రూ.49,500 వద్ద మార్కెట్ అవుతోంది.

 

గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో దిగొచ్చిన వెండి ధరలు (Silver Rate in India) మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా వెండి ధర రూ.300 మేర పెరగడంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,400కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఒకే ధరలో మార్కెట్ అవుతోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News