Gold Price Today In Hyderabad: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం

Gold Price Today In Hyderabad | కరోనా వ్యాప్తి సమయంలో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. మరుసటి రోజే అంతే మొత్తంలో పెరుగుతున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రబావితం చేస్తాయి.

Last Updated : Oct 21, 2020, 06:30 AM IST
  • బులియన్ మార్కెట్‌లో భారీగా క్షీణించిన బంగారం ధరలు
  • కరోనా వ్యాప్తి సమయంలో భారీగా దిగొస్తున్న వెండి ధరలు
  • ప్రస్తుతం మార్కెట్‌లో 1 కేజీ వెండి రూ.750 తగ్గడంతో ధర రూ.62,000 అయింది
Gold Price Today In Hyderabad: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ తగ్గుతున్నాయి. అదే సమయంలో వెండి ధరలు సైతం భారీగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో తాజాగా బంగారం ధర రూ.780 మేర భారీగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,950కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.390 తగ్గడంతో ధర రూ.46,700కి క్షీణించింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా నాలుగోరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధరలలో ఏ మార్పు రాలేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,790 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,310గా స్థిరంగా ఉంది.

 

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో పెరుగుతూ వచ్చిన వెండి ధరలు (Silver Rate in India) తాజాగా భారీగా దిగొచ్చాయి. తాజాగా వెండి ధర రూ.750 మేర భారీగా తగ్గింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.62,000వద్ద మార్కెట్ అవుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర ఉంటుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News