Gold Price Today: బంగారం ప్రయులకు మరోసారి గుడ్‌న్యూస్. వరుసగా మూడవరోజు కూడా బంగారం ధర గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశిలిద్దాం.
మొన్నటివరకూ పైపైకి ఎగబాకిన పసిడి ధర గత మూడ్రోజులుగా తగ్గుముఖం పడుతోంది. నిన్నటితో పోలిస్తే పది గ్రాముల బంగారం ధరపై 250 రూపాయల వరకూ తగ్గింది. నిన్న 190 రూపాయల వరకూ తగ్గింది. బంగారం ధర తగ్గుతుండటంతో పసిడిపై ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికిది ఇదే అనువైన సమయంగా మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో అన్నింటికంటే అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేలు కాగా, 22 క్యారెట్ల బంగారం(Gold Price) పది గ్రాముల ధర 46 వేల 750 రూపాయలుగా ఉంది. ఇక ఆర్ధిక రాజధాని నగరం మంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 120 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 47 వేల 120 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 960 రూపాయలైతే, 22 క్యారెట్ల బంగారం ధర 44 వేల 880గా ఉంది.మరోవైపు కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 650 కాగా, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 600 రూపాయలుగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు తక్కువగా, బెంగళూరు నగర ధరలకు సమానంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price)24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 650 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 44 వేల 600 రూపాయలుగా ఉంది. విజయవాడలో(Vijayawada Gold Price)సైతం 24 క్యారెట్ల బంగారం ధర 48 వేల 650 రూపాయలు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 44 వేల 6 వందలుగా ఉంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Also read: GST Collection November 2021: జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.31 లక్షల కోట్ల ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook