Todays Gold Rate: మరోసారి పెరిగిన బంగారం, దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు

Gold Price Today: కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు షాక్ కలిగింది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2022, 06:49 AM IST
Todays Gold Rate: మరోసారి పెరిగిన బంగారం, దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు

Gold Price Today: కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు షాక్ కలిగింది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వల ప్రభావం బంగారం ధరలపై ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బంగారం ధరలు మారుతుంటాయి. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate)10 గ్రాముల ధర 47 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51 వేల 520 రూపాయలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 10 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 10 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 250 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం గ్రాముల ధర 49 వేల 370 రూపాయలుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 150 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 850 రూపాయలుంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 అయితే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 200 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 100 అయితే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 2 వందలుగా ఉంది. 

Also read: IT returns: ఐటీఆర్​ దాఖలు గడువు పెంచే యోచన లేదు: కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News