Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు ఇలా ఉన్నాయి!

Gold Price decresed on 20th December 2022 in Hyderabad and India: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 20, 2022, 06:41 AM IST
  • బంగారం ప్రియులకు శుభవార్త
  • తగ్గిన బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు ఇలా ఉన్నాయి!

Gold Price decresed and Silver Price hiked on 20th December 2022: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతాయి.. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఈ పసిడి ధరలు ప్రపంచ, దేశంలోని వివిధ భోగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే దేశంలోని ప్రజలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి.. ధరల్లో ఎంత మార్పు ఉన్నా కొనుగోళ్లు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి.

గత కొన్ని రోజలుగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. పెరిగిన బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు అవుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 20) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,600లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,110లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 350.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 380 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,260గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,100గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,190 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,650గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,160గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,110గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,600.. 24 క్యారెట్ల ధర రూ. 54,110గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,110 వద్ద కొనసాగుతోంది. 

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. మంగళవారం (డిసెంబర్ 20) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 69,500లుగా ఉండగా.. చెన్నైలో రూ. 73,100లుగా ఉంది. బెంగళూరులో రూ. 73,100గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,100లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 73,100ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: Mercury Rise 2023: జనవరి 12న ధనుస్సు రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశుల వారికి శుభప్రదం! కొత్త ఉద్యోగం, వ్యాపారంలో భారీ ఆదాయం

Aslo Read: Crassula Plant Vastu Tips: ఈ చిన్న మొక్క మనీ ప్లాంట్ కంటే అత్యంత ప్రభావమైనది.. ఇంట్లో నాటిన వెంటనే డబ్బు వర్షం కురుస్తుంది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News