Gautam Adani ఎనలేని సంపదను పోగేసుకొని ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా నిలచిన గౌతమ్ అదానీకి మార్కెట్‌లో $100 బిలియన్ల క్లబ్ నుండి క్రాష్ అయినప్పటికీ...బిలియనీర్ల ఎలైట్ క్లబ్ నుంచి మాత్రం ఇంకా క్రాష్ కాకపోవడం గమనార్హం. కొన్ని నెలల కిదంట $125 బిలియన్ల సంపదతో ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచాడు. అయితే ఆ తర్వాత కాలక్రమంలో అదానీ గ్రూపులోని ఆరు లిస్టెడ్ సంస్థలు ₹2.17 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. అయినప్పటికీ ఆయన కుబేరుడిగానే కొనసాగుతున్నారు.
తన లిస్టెట్ కంపెనీలు దారుణమైన నష్టాలు చవిచూడడంతో ఇప్పుడు అదానీకి, అంబానీకి మధ్య ఉన్న అంతరం $30 బిలియన్ల నుండి ఇప్పుడు కేవలం $3 బిలియన్ల డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. అనుభవం ఉన్న రంగాలతో పాటు అనుభవం లేని రంగాల్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టడంతో గౌతమ్ అదానీ నష్టాలు చవి చూడాల్సి వస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కట్‌లో మంచి గ్రోత్ కనబరుస్తున్న ప్రతీ రంగంలో పెట్టుబడులు పెట్టుకుంటూ పోతున్న అదానీ అసలు ఆ రంగంలో తనకు ఉన్న అనుభవం ఎంత అనేది విశ్లేషించకుండా ఆరంగానికి ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న గ్రోత్ మాత్రమే చూడడం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.
భారీ క్షీణత ఉన్నప్పటికీ, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ ఈ సంవత్సరం $23 బిలియన్లను సంపాదించారు. సాఫ్ట్ వేర్ రంగంలో అందరికంటే ముందే ఆరంగేట్రం చేసి ఎనలేని సంపదన పోగు చేసుకున్న ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ తో సమానమైన సంపదను అదానీ సరితూడుతున్నాడు. అదానీ గ్రీన్ పునరుత్పాదక ఇంధన సంస్థ ఆర్జిస్తున్న ఆదాయంతో ఈ సంపదన పోగైనట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
adani, gautham adani, $100 billion club, Adani group’s , MSCI’s, Holcim in a deal, అదానీ, గౌతమ్ అదానీ, 100 బిలియన్ క్లబ్, అదానీ గ్రూప్