Jio Plans with OTT Access: జియో అందిస్తున్న ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్..

Jio Plans with OTT Access:ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కూడా కస్టమర్స్ కోసం ఓటీటీ యాక్సెస్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ద్వారా ఫోన్ కాల్స్, డేటా సౌకర్యంతో పాటు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఉచిత యాక్సెస్ పొందవచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 31, 2022, 12:09 PM IST
  • జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్
  • ఈ ప్లాన్స్ ద్వారా ఉచిత ఓటీటీ యాక్సెస్
  • ఒకే ప్లాన్‌తో అటు కాలింగ్, డేటా సౌకర్యంతో పాటు ఇటు ఓటీటీ యాక్సెస్
Jio Plans with OTT Access: జియో అందిస్తున్న ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్..

Jio Plans with OTT Access: టెలికాం సంస్థలు కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు సరికొత్త రీఛార్జ్  ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఉచిత ఓటీటీ యాక్సెస్‌తో రీఛార్జ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కూడా కస్టమర్స్ కోసం ఓటీటీ యాక్సెస్‌తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ద్వారా ఫోన్ కాల్స్, డేటా సౌకర్యంతో పాటు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఉచిత యాక్సెస్ పొందవచ్చు.  ప్రస్తుతం ఓటీటీ యాక్సెస్‌తో జియో అందిస్తున్న పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

జియో రూ.399 ప్లాన్ :

జియో అందిస్తున్న రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో  ప్రతీ నెలా 75GB డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌లకు ఒక సంవత్సరం పాటు ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

జియో రూ.599 ప్లాన్ :

జియో అందిస్తున్న రూ.599 ప్లాన్ ద్వారా  100 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలకు ఒక సంవత్సరం ఉచిత యాక్సెస్ పొందుతారు.

జియో రూ.799 ప్లాన్ :

జియో అందించే రూ.799 ప్లాన్‌లో 200 జీబీ డేటా పొందుతారు. ఇందులో 150జీబీ రోల్‌ఓవర్ డేటా పొందవచ్చు. అంటే.. మీరు ఉపయోగించని డేటా తర్వాతి నెలలో ఉపయోగించుకోవచ్చు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్, అపరిమిత ఎస్ఎంఎస్‌లు పొందుతారు. అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలకు ఉచిత యాక్సెస్ పొందుతారు.

జియో రూ.999 ప్లాన్ : 

జియో అందిస్తున్న రూ.999 పోస్ట్‌ పెయిడ్ ప్లాన్‌లో 200 జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, అపరిమిత ఎస్ఎంఎస్‌లు పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలకు ఉచిత యాక్సెస్ పొందుతారు.

జియో టాప్ ప్లాన్ రూ.1499

జియో టాప్ ప్లాన్ రూ.1499తో 300 జీబీ డేటా పొందుతారు. ఇందులో డేటా రోల్‌ఓవర్ కూడా ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా కేవలం ఇండియాలోనే కాదు, యూఎస్, యూఏఈలకు కూడా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ+హాట్‌స్టార్‌లకు ఒక సంవత్సరం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 

Also Read: Apple iPhone 13: యాపిల్ ఐఫోన్ 13పై బంపరాఫర్.. రూ.29 వేల వరకు తగ్గింపు..   

Als Read: Earthquake: ఖాట్మండులో భూకంపం.. బీహార్ లోనూ ప్రకంపనలు.. వణికిన జనాలు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News