Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై 80 శాతం డిస్కౌంట్ ఆఫర్లు

Flipkart Big Billion Days Sale: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. అటు అమెజాన్ సైతం ఇందుకు సిద్ధమౌతోంది. సేల్ ఎప్పుడు ప్రారంభమో కంపెనీ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 26, 2023, 12:12 PM IST
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై 80 శాతం డిస్కౌంట్ ఆఫర్లు

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో కంపెనీ ఇచ్చే ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ఆఫర్లు ముంచెత్తనున్నాయి. బ్రాండెడ్ ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్ అందనుంది. 

ప్రముఖ ఈ కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఎప్పటికప్పుడు ప్రత్యేక సేల్‌లతో పోటీ పడుతుంటాయి. ఈసారి ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ కాస్త ముందుంది. త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభించనుంది. దసరా పండుగ నేపధ్యంలో ఈ సేల్ అలరించనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపితే నేరుగా 10 శాతం డిస్కౌంట్ అందనుంది. బ్యాంకు ఆఫర్లు కాకుండా కంపెనీ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎలానూ ఉంటాయి. దీనికితోడు క్యాష్‌బ్యాక్, ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి.

బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనుగోళ్లకు వివిధ పేమెంట్ యాప్స్‌తో కూడా చెల్లింపు జరపవచ్చు. పేటీఎం చెల్లింపులపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. పేటీఎం యాప్, యూపీఐ, వాలెట్లు ఉపయోగిస్తే సేవింగ్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ కూడా ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ త్వరలో ప్రారంభించనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ 80 శాతం డిస్కౌంట్ అందించే జాబితాలో మోటో జి54 5జి, గెలాక్సీ ఎఫ్ 34 5జి, రియలా్ మి సి51, రియల్ మి 11 5జి, రియల్ మి 11 ఎక్స్ 5జి, ఇన్ఫినిక్స్ జీరో 30 జి, మోటో జి84 5జి, వివో వి29 ఇ, పోకో ఎం6 ప్రో 5జి మోడళ్లు ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ చేసిన టీజ్ ద్వారా తెలుస్తోంది. 

అక్టోబర్ 1వ తేదీన ఐఫోన్, అక్టోబర్ 3న శాంసంగ్, అక్టోబర్ 5న పిక్సెల్, అక్టోబర్ 7న షియోమీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు లిస్ట్ కానున్నాయి. ఇవి కాకుండా ఆపిల్ ఐఫోన్లు, శాంసంగ్, గూగుల్ పిక్సెల్, ఒప్పో, రియల్ మి, షియోమి, నథింగ్, ఇన్ఫినిక్స్, వివో వంటి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఆఫర్లు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పట్నించి ప్రారంభమయ్యేది కచ్చితమైన తేదీల్ని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8 వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. 

Also read: LIC Dhan Vriddhi Plan: ఎల్ఐసీ సూపర్ స్కీమ్.. మరో ఐదు రోజులే గడువు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News