Flipkart Smartphone Offers: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జి ఇప్పుడు సగం ధరకే, త్వరపడండి

Flipkart Smartphone Offers: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉన్నా మేజర్ వాటా మాత్రం శాంసంగ్‌దే. శాంసంగ్ ఇటీవల లాంచ్ చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఇంకా మార్కెట్‌లో వచ్చి నెలరోజులు కాకున్నా..క్రేజ్ పెరిగింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2023, 08:04 AM IST
Flipkart Smartphone Offers: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జి ఇప్పుడు సగం ధరకే, త్వరపడండి

Flipkart Smartphone Offers: స్మార్ట్‌ఫోన్లలో లీడింగ్ బ్రాండ్‌గా కొనసాగుతున్న శాంసంగ్ నుంచి జూలై నెలలో రెండు కొత్త మోడల్స్ లాంచ్ అయ్యాయి. అందులో ఒకటి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, రెండవది శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5. మరో రెండు శాంసంగ్ ఫోన్లపై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..

శాంసంగ్ అంటే ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో రారాజు అనే చెప్పాలి. ఎందుకంటే శాంసంగ్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, స్మార్ట్‌ఫోన్లు అన్నింట్లోనూ ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంటుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ఫోన్లకు ప్రత్యేకత ఉండనే ఉంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌గా ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జి స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా డిస్కౌంట్ అందుతోంది. దాదాపు సగం ధరకే ఈ అద్బుతమైన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జిలో 12 జిబీ ర్యామ్ ఉండటంతో చాలా వేగంగా పనిచేస్తుంది. ఇందులో సూపర్ పవర్‌ఫుల్ కెమేరా సెటప్ ఏకంగా 200 మెగాపిక్సెల్ కలిగి ఉండటం మరో విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 1,49,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 1,24,999 రూపాయలకు లభిస్తుంది. అంటే నేరుగా 25 వేల రూపాయలు డిస్కౌంట్ అందుతోంది. అయితే ఈ డిస్కౌంట్లు పూర్తవలేదు. ఇంకా ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే కచ్చితంగా ముందు చెప్పినట్టు సగం ధరకే లభిస్తుంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ 45,600 రూపాయలు లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ విలువ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. అది కాకుండా హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌తో లావాదేవీలు జరిపితే మరో 8 వేల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. అంటే ముందుగా చెప్పినట్టే మీక్కావల్సిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జి కేవలం 71,399 రూపాయలకే లభిస్తుంది. అంటే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మీరు కేవలం ఎంఆర్‌పిపై సగం ధరకే పొందే అద్బుతమైన అవకాశమిది. 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జి ప్రత్యేకతలు

శాంసంగ్ ఎస్ 23, గెలాక్సీ ఎస్ 23 ప్లస్‌తో పాటు ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జి లాంచ్ చేసింది. ఇది ప్రీమియం ఫోన్. 6.8 ఇంచెస్ డైనమిక్ ఎమోల్డ్ డిస్ ప్లేతో పాటు  QHD+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మరోవైపు 1750 నిట్స్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ ప్రత్యేకత కాగా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో లభించనుంది. ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రొసెసర్ ఉంటుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ , 1 టీబీ స్టోరేజ్ ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ కెమేరా గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తగ్గదు.  ఏకంగా 200 మెగాపిక్సెల్ ఐసోసెల్ హెచ్‌పి 2 సెన్సార్ కలిగి ఉంటుంది. అల్ట్రా వైడ్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ కాగా టెలీఫోటో కెమేరా 10 మెగాపిక్సెల్ ఉంటుంది.పెరిస్కోపిక్ లెన్స్ ఈ ఫోన్‌లో ఇంకో ప్రత్యేకత.

ఇక బ్యాటరీ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. 45 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదనంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వైఫై 6ఇ సపోర్ట్ చేస్తుంది. 

Also read; Discount on iPhone 14 : ఐఫోన్ 14 పై రూ. 37 వేల వరకు డిస్కౌంట్.. యాపిల్ వాచ్ ఫ్రీ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News