Flipkart Budget Phones: బడ్జెట్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.14 వేలు విలువ చేసే రియల్‌మీ ఫోన్ కేవలం రూ.150కే...

Flipkart Mobile Phone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బడ్జెట్ ఫోన్లపై 'బిగ్ బచత్ ధమాల్' సేల్ కింద భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 04:29 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్
  • అతి చౌక ధరకే బడ్జెట్ ఫోన్లు
  • రూ.14 వేలు విలువ చేసే రియల్‌మీ ఫోన్ కేవలం రూ.150కే..
Flipkart Budget Phones: బడ్జెట్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్.. రూ.14 వేలు విలువ చేసే రియల్‌మీ ఫోన్ కేవలం రూ.150కే...

Flipkart Mobile Phone Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  బిగ్ బచత్ ధమాల్ సేల్ కింద ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. బడ్జెట్ ఫోన్లను మరింత చౌక ధరలో కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. రూ.13,999 విలువ చేసే రియల్‌మీ సీ35 (బ్లాక్, 64 జీబీ) మొబైల్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,999కే అందుబాటులో ఉంది. అయితే డిస్కౌంట్ ఆఫర్స్‌ పూర్తిగా వినియోగించుకున్నట్లయితే ఈ బడ్జెట్‌ ఫోన్‌ని కేవలం రూ.150కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ :

రియల్‌మీ సీ35 (బ్లాక్, 64 జీబీ) సాధారణ ధర రూ.13,999. ఫ్లిప్‌కార్ట్‌లో 14 శాతం మేర దీనిపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. డిస్కౌంట్ పోను రూ.11,999కే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే మరో 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అంటే.. రూ.599 తగ్గింపు లభించినట్లే. అలా ఈ ఫోన్‌ను రూ.11,400కే పొందవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.150కే :

రియల్‌మీ సీ35 (బ్లాక్, 64 జీబీ) ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ రూపంలో భారీ తగ్గింపు అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై రూ.11,250 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డుతో 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా పొందినట్లయితే... మరో రూ.599 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తించినట్లయితే రూ.11,999కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌పై రూ.11,849 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే రియల్‌మీ సీ 35 (బ్లాక్, 64 జీబీ)ని కేవలం రూ.150 కే కొనుగోలు చేయవచ్చు. బిగ్ బచత్ ధమాల్ సేల రేపటితో (మే 22) ముగియనుంది. కాబట్టి ఈ ఫోన్‌ని కొనాలనుకునేవారు త్వరగా ఆర్డర్ చేస్తే బెటర్. ఇక ఈ ఫోన్‌కి సంబంధించి ఎక్స్‌చేంజ్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్‌కు కొన్ని షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. 

Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే... 

Also Read: Telangana Rains Alert: తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News