ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు ఇండో అమెరికన్ మహిళలకు స్థానం

Forbes list: ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫోర్బ్స్ జాబితా విడుదలైంది. భారతీయ మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురికి స్థానం దక్కడం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 12, 2021, 02:18 PM IST
ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురు ఇండో అమెరికన్ మహిళలకు స్థానం

Forbes list: ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫోర్బ్స్ జాబితా విడుదలైంది. భారతీయ మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ జాబితాలో ఐదుగురికి స్థానం దక్కడం విశేషం.

ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితా(Forbes list) విడుదలైంది. ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన యూఎస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్ (Us richest self made women)జాబితాలో భారతీయ మహిళలకు స్థానం దక్కింది. భారతీయ సంతతికి (Indo american women listed in forbes)చెందిన ఐదుగురు అమెరికా మహిళలు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఆగస్టు 5న ఫోర్బ్స్ జాబితా విడుదలైంది. ఈసారి జాబితాలో పదిహేను మంది కొత్తగా చేరినట్టు తెలుస్తోంది. జయశ్రీ ఉల్లాల్, నీరజ్ సేఠి, నేహా నర్ఖడే, రేష్మా శెట్టి, ఇంద్రా నూయి(Indra nooyi)లు ఫోర్బ్స్ జాబితాలో చేరడం గమనార్హం. 

ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఐదుగురు మహిళల్లో జయశ్రీ ఉల్లాల్(Jayshree ullal)..అరిస్టా నెటవర్క్స్ సీఈవోగా 16 వ స్థానంలో, ఇంద్రా నూయీ పెప్సికో మాజీ సీఈవో 91వ స్థానంలో, నీరజా సేఠి..సింటెల్  ఐటీ కంపెనీ కో ఫౌండర్ 26వ స్థానంలో, కాన్ఫ్లుయెంట్ కంపెనీ కో ఫౌండర్ నేహా నర్ఖడే 29వ స్థానంలోనూ, జింగ్‌కో బయో‌వర్క్స్ కో ఫౌండర్ రేష్మా శెట్టి  39వ స్థానంలోనూ ఉన్నారు.  

Also read: షావోమీ నుంచి మరో సంచలనం, త్వరలో మార్కెట్‌లో సైబర్ డాగ్ రోబోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News