ICICI Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బాటలో ఐసీసీఐ.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు

ICICI Bank Hike FD Rate: ఆర్‌బీఐ రెపో రేటును పెంచడంతో వడ్డీ రేట్లలో అన్ని బ్యాంకులు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హెచ్‌డీఎఫ్‌సీ తరహాలో ఐసీసీఐ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేట్లను పెంచింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 05:08 PM IST
ICICI Bank FD Rates: హెచ్‌డీఎఫ్‌సీ బాటలో ఐసీసీఐ.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు

ICICI Bank Hike FD Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు పెంచడం లోన్లు తీసుకున్న వారిని ఇబ్బందులకు గురి చేస్తుండగా.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసిన వారు మాత్రం పండగ చేసుకుంటున్నారు. రెపో రేటు పెరుగుదల కారణంగా.. అన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గతంలో కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచగా.. తాజాగా మరో బ్యాంక్ కూడా గుడ్‌న్యూస్ అందించింది. తమ ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పులు చేసినట్లు ఐసీసీఐ వెల్లడించింది.

రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను  బ్యాంక్ పెంచింది. ప్రస్తుతం 4.75 శాతం నుంచి 7.15 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది ఐసీసీఐ. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 23 నుంచి వర్తిస్తాయని బ్యాంక్ వెల్లడించింది.

కొత్త వడ్డీ రేట్లు ఇలా..

==> 7 రోజుల నుంచి  29 రోజుల వరకు -4.75 శాతం
==> 30 రోజుల నుంచి 45 రోజులు -5.50 శాతం
==> 46 రోజుల నుంచి 60 రోజులు -5.75 శాతం
==> 61 రోజుల నుంచి 90 రోజులు -6.00 శాతం
==> 91 రోజుల నుంచి 184 రోజులు -6.50 శాతం
==> 185 రోజుల నుండి 270 రోజులు -6.65 శాతం 
==> 271 రోజుల నుండి 289 రోజులు -6.75 శాతం 
==> 290 రోజుల నుంచి  2 సంవత్సరాల వరకు -7.15 శాతం
==> 2 సంవత్సరాలు 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు -7.00 శాతం 
==> 3 సంవత్సరాలు 1 రోజు నుంచి 5 వరకు సంవత్సరం వరకు -6.75 శాతం 
==> 5 సంవత్సరాలు 1 రోజు నుంచి 10 సంవత్సరాలు -6.75 శాతం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను పెంచింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెరిగినట్లు వెల్లడించింది. సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. పెరిగిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చాయి.

Also Read: Pee Gate in Karnataka: బస్సులో నిద్రిస్తున్న మహిళపై మూత్రం పోసిన యువకుడు   

Also Read: Umesh Yadav Father: ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News