EPS-95: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న 78 లక్షల మంది పెన్షనర్లకు శుభవార్త వినిపించనుంది. ఈపీఎస్ 95 స్కీం కింద సభ్యులైన పెన్షన్ దారులకు కనీస నెలవారి పెన్షన్ 7500 రూపాయలకు పెంచాలని డిమాండ్ కు సానుకూలత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఈపీఎస్ 95 నేషనల్ అజిటేషన్ కమిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సోమవారం విజ్ఞప్తి చేసింది. ఆమె అందుకు సానుకూలంగా స్పందించారు.
ప్రభుత్వం ఈపీఎఫ్ సభ్యుల పట్ల 7.5 కోట్ల మంది సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పెన్షనర్ల ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించేందుకు ఆమె వారికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే గత నెల కూడా పెన్షనర్ సంఘం ప్రతినిధులు కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవ్యాను కలిసి తమ సమస్యపై విజ్ఞప్తి చేశారు.
Also Read : Early Investing : కొత్తగా ఉద్యోగంలో చేరారా? రిటైర్మెంట్ రూ. 10కోట్ల ఫండ్ కావాలంటే ఈజీ మార్గం ఇదే
ఇదిలా ఉంటే కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంచాలనే ప్రధాన డిమాండ్ తో ఈపీఎస్ 95 పెన్షన్ దారుల జాతీయ ఆందోళన కమిటీ గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పెన్షన్ దారులకు నెలవారి పెన్షన్ 1000 రూపాయలుగా ఉంది. ఈపీఎస్ 95 యాజిటేషన్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ సుమారు 78 లక్షల మంది పెన్షనర్లు ఈ స్కీం కింద పెన్షన్ పొందుతున్నారని వీరిలో 40 లక్షల మందికి కేవలం 1500 రూపాయల కంటే తక్కువ పెన్షన్ లభిస్తుంది. అని మిగతా వారికి 2000 రూపాయల నుంచి 2500 రూపాయల మధ్యలోనే పెన్షన్ అందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ఓ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రన్ చేసే ఈపీఎస్ 95 పథకం కింద దేశ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ కార్పోరేషన్ ఉద్యోగులు చందాదారులుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ఓ దగ్గర 2022 మార్చి 31 నాటికి కార్పస్ ఫండ్ కింద రూ.18,64,136 కోట్లు ఉందని అప్పటి కేంద్రమంత్రి పార్లమెంట్‌కు తెలిపారు. ఇందులో రూ.11,37,096 కోట్లు ఎంప్లాయీ ప్రావిడెండ్ ఫండ్ స్కీమ్‌లో ఉండగా, రూ.6,89,210.72 కోట్లు EPS-1995 స్కీంలో ఉన్నాయి. మరో రూ.37,828.56 కోట్లు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ఉన్నాయని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.