ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు శుభవార్త అందించింది. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.. అయితే మీ కోసమే EPFO కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్19 నేపథ్యంలో పీఎఫ్ ఖాతాదారులకు (PF Accounts) సేవలు అందించేందుకు ఈపీఎఫ్‌ఓ సరికొత్తగా వాట్సాప్ సర్వీసులు (EPFO WhatsApp helpline service) ప్రారంభించింది. దీని వల్ల ఖాతాదారులు నేరుగా ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించే అవకాశం లభిస్తుంది.
- Also Read : EPFO ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు ఫిక్స్
కార్మిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా పీఎఫ్ వాట్సాప్ సర్వీసులు (EPFO WhatsApp service) అంశాన్ని వెల్లడించంది. పీఎఫ్ ఖాతాదారులకు వన్ టు వన్ పద్ధతిలో వాట్సాప్ ద్వారా ఒక్కొక్కరికి సేవలు అందించనుంది. 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
- Also Read : EPFO: PFను సులువుగా ఇలా విత్‌డ్రా చేసుకోండి
కాగా, ఆయా ప్రాంతీయ కార్యాలయాలకు సంబంధించిన వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లు EPFO official websiteలో అందుబాటులో ఉంచినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజా వాట్సాప్ సర్వీసుల కారణంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా నమోదవుతున్న కేసుల రిజిస్ట్రేషన్లు 30శాతం మేర తగ్గాయని, ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ గ్రీవెన్స్ రిజోల్యూషన్ పోర్టల్ (EPFiGMS)లో 16శాతం మేర ఫిర్యాదులు తగ్గినట్లు తెలిపింది. (https://www.epfindia.gov.in/)
- Also Read : EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe