EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వోలో భారీగా ఉద్యోగాల భర్తీ, పదో తరగతి, డిగ్రీ అర్హత, జీతం 80 వేలు

EPFO Recruitment 2023: ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారికి శుభవార్త. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఈపీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఏయే ఉద్యోగాలున్నాయి, అర్హత వివరాలేంటో పరిశీలిద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2023, 03:28 PM IST
EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌వోలో భారీగా ఉద్యోగాల భర్తీ, పదో తరగతి, డిగ్రీ అర్హత, జీతం 80 వేలు

EPFO Recruitment 2023: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్తగా రిక్రూట్‌మెంట్ చేపట్టింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ సహా వివిధ ఖాళీల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాలకు కావల్సిన అర్హత , జీతభత్యాల వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. 12వ తరగతి పాస్, డిగ్రీ హోల్డర్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది బంపర్ అవకాశమనే చెప్పాలి. ఎందుకంటే ఈపీఎఫ్‌లో ఉద్యోగమంటే ఒత్తిడి తక్కువ, జీతం ఎక్కువ ఉంటుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో రెండు రకాల పోస్టులు సోషల్ సెక్యూరిటీ, స్టెనోగ్రాఫర్ ఉన్నాయి. రెండింటినీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చ్ 27 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 23 వరకూ ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పూర్తి వివరాలు చాలా ఉన్నాయి.

కావల్సిన అర్హత ఏంటి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అయుండాలి. అంతేకాకుండా నిమిషానికి 35 పదాల వేగంతో ఇంగ్లీషు టైపింగ్ లేదా 30 పదాల వేగంతో హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల్లో 359 ఎస్‌సి, 2763 ఎస్టీ, 514 ఓబీసీ 529 ఈడబ్ల్యూసీ, 999 పోస్టులు అన్ రిజర్వ్‌డ్ వర్గాలకు ఉద్దేశించి ఉన్నాయి.ఇక స్టెనోగ్రాఫర్ పోస్టుల్లో 74 మాత్రమే అన్ రిజర్వ్‌డ్ ఉన్నాయి. 19 పోస్టులు ఈడబ్ల్యూఎస్, 28 ఎస్‌సి, 14 ఎస్టీ, 50 ఓబీసీలకు ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయుండాలి. 

వయస్సు ఎంత ఉండాలి

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారి వయస్సు 18-27 ఏళ్లలోపుండాలి. రిజర్వేషన్ కేటగరీ ఎస్సీ, ఎస్టీకు వయస్సు సడలింపు ఉంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

ఎంపిక ఎలా

ఎస్ఎస్ఏ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ లిఖిత పరీక్ష తరువాత స్టేజ్ 2లో కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు 700 రూపాయలు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఏ విధమైన ఫీజుండదు. ఇక జీతభత్యాలైతే అన్నీ కలుపుకుని నెలకు 80 వేలవరకూ ఉంటుంది. 

Also read: IPL2023 New Rules: ఐపీఎల్ 2023లో మారిన కొత్త నిబంధనలేంటి, ఇంపాక్ట్ ప్లేయర్, టాస్ , డీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News