EPF Interest Rate Fixed at 8.15% for FY 2022-23: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కోట్లాది ఖాతాదారులకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై వడ్డీని పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.15 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. దేశంలోని 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారులకు వడ్డీ పెరిగింది. 2021-22కి పీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించగా.. ఇది గత నాలుగు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.5 శాతంగా ఉంది. ఈ ఏడాది కూడా వడ్డీ రేటు తగ్గుతుందని నిపుణులు అంచనా వేయగా.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. 8.15 శాతానికి ఈపీఎఫ్‌ఓ పెంచింది.
ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన విషయం తెలిసిందే. మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ రేటును ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేట్లను నిర్ణయించిన వెంటనే.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఫైల్‌ను పంపించింది. ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ.. ఆర్థికశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ వడ్డీ రేట్లను కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించే అవకాశం ఉంది.
EPFO decides the rate of interest EPF for FY23. The rate of interest on EPF would be 8.15% for FY23. The labour ministry will send the proposal to the finance ministry for approval. pic.twitter.com/tPBqLgVTXm
— ANI (@ANI) March 28, 2023
పీఎఫ్ అకౌంట్‌లో నిల్వ ఉన్న నగదుపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ జమకానుంది. గతేడాది 8.10 శాతం ఉండగా.. ఈ ఏడాది మరో 0.05 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సంఘటిత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది అమలు చేసిన వడ్డీ రేటు (8.10 శాతం) 43 సంవత్సరాలలో ఇదే అతి తక్కువ. 1977-78 మధ్య కాలంలో 8 శాతం వడ్డీ రేటు అమలు చేసింది. 2015-16లో ఈపీఎఫ్ చందాదారులకు వడ్డీరేటు 8.8 శాతంగా ఉంది. 2016-17లో 8.65 శాతం వడ్డీని ఆఫర్ చేసింది. ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2020-21లో ఈ రేటు 8.50 శాతంగా ఉండేది. మొత్తంగా గత ఏడేళ్ల వ్యవధిలో పీఎఫ్ వడ్డీ రేటు 0.65 శాతం వరకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరానికి పెంచినా.. స్వల్ప మొత్తంలోనే పెంచింది. ఈపీఎఫ్‌ఓ దాదాపు 6 కోట్ల మంది సభ్యులను కలిగి ఉంది.
Also Read: CAG Report: కాగ్ సంచలన రిపోర్ట్.. అడగకుండానే ఈ బ్యాంక్‌కు రూ.8,800 కోట్లు ..!
Also Read: IPL 2023: రూమ్ పాస్‌వర్డ్ మర్చిపోయిన సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ డైలాగ్స్‌తో సెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి