Electric Scooters Comparision: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్టో మీరే చూడండి

Electric Scooters Comparision: ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే హవా నడవనుంది. ఇప్పటికే టూ వీలర్స్ లో, ఫోర్ వీలర్స్ లో ఎన్నో కంపెనీలు ఎన్నో మోడల్స్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తీసుకొచ్చాయి.

Last Updated : May 9, 2023, 02:57 AM IST
Electric Scooters Comparision: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్టో మీరే చూడండి

Electric Scooters Comparision: కొత్తగా వాహనం కొనుగోలు చేసే వారు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహానాలు కొనేందుకు ప్లాన్ చేస్తున్న వారు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి సంబంధించిన ధరలు ఎలా ఉన్నాయి, ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి, ఏయే ఎలక్ట్రిక్ స్కూటీ ఎంత రేంజ్ ఇస్తుంది, ఎంత వరకు హై స్పీడ్ వెళ్తుంది అనే వివరాలను తెలుసుకుందాం రండి.

ఓలా ఎస్1 ప్రో:
ఎలక్ట్రిక్ స్కూటీలలో ఎక్కువ డిమాండ్ ఉన్న వెహికిల్ ఇది. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటీ ధర రూ. 1.25 లక్షలు కాగా ఒక్కసారి చార్జ్ చేస్తే 181 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ 116 కిమీ మ్యాగ్జిమం స్పీడ్‌తో వెళ్తుంది అని ఓలా కంపెనీ స్పష్టంచేసింది.

అథర్ 450X ప్రో ప్యాక్:
అథర్ 450X ప్రో ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర రూ. 1.32 లక్షలు కాగా అథర్ 450X థర్డ్ జెనరేషన్ స్కూటీ సింగిల్ చార్జింగ్ తో 108 కిమీ దూరం ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ 90 కిమీ హై స్పీడ్ తో ప్రయాణించగలదు. 

హీరో విదా వి1 ప్లస్:
హీరో విదా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటీ ధర 1.03 లక్షలు ఉండగా.. ఒక్కసారి చార్జ్ చేస్తే 85 కిమీ దూరం ప్రయాణిస్తుంది. గంటకు 80 కిమీ వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది కూడా ఒకటి.

ఇది కూడా చదవండి : Top CEOs' Salary: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు

బజాజ్ చేతక్:
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.22 లక్షలుగా నిర్ణయించగా.. గంటకు 63 కిమీ హై స్పీడ్ తో మాత్రమే వెళ్లగలిగే ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 కిమీ ప్రయాణించే సామర్థ్యం కలదు.

ఇది కూడా చదవండి : iPhone 14 Best Price: అమేజాన్ vs ఫ్లిప్‌కార్ట్ vs విజయ్ సేల్స్.. మూడింట్లో ఎక్కడ తక్కువ ధర ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x