Magical Rs.1 Note: గంటలో లక్షాధికారిని చేసే 1 రూపాయి నోటు.. దీని ఖరీదు రూ.7 లక్షలు

మీ దగ్గర పాత నోట్లు ఉంటే.. ఒక్క రోజులోనే లక్షల్లో సంపాదించవచ్చు.. మీ దగ్గర కనుక ఈ 1 రూపాయి నోటు ఉంటే క్షణాల్లో రూ.7 లక్షలు సంపాదించవచ్చు   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 07:58 PM IST
  • మీ దగ్గర ఈ 1 రూపాయి నోటు ఉందా..??
  • అయితే మీరు రెప్పపాటులో లక్షాధికారి అవ్వొచ్చు
  • ఈ ఒక్క రూపాయి ఖరీదు రూ. 7 లక్షలు
  • ఆన్ లైన్ లో అమ్మి సులభంగా డబ్బు సంపాదించవచ్చు
Magical Rs.1 Note: గంటలో లక్షాధికారిని చేసే 1 రూపాయి నోటు.. దీని ఖరీదు రూ.7 లక్షలు

Magical Rs. 1 Note Make you Millionaire: కొంత మందికి పాత నాణేలు, నోట్లు సేకరించటం అలవాటు.. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే నిమిషాల్లో లక్షాధికారిని చేస్తుంది. మీ దగ్గర కనుక ఇలాంటి పాత నోట్లు, నాణేలు ఉంటే మీరు లక్షాధికారి అవ్వచ్చు. కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించుకునే వారికి అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా.. డబ్బు సంపాదించాలంటే.. మీ దగ్గర ఈ ఒక్క 1 రూపాయి నోటు ఉంటే చాలు.. ఏకంగా 7 లక్షల రూపాయలు పొందవచ్చు . 

లక్షల్లో సంపాదించవచ్చు.. 
నిజానికి, ఈ రోజు నుండి సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, భారత ప్రభుత్వం ఈ ఒక్క రూపాయి నోటును ముద్రించటం నిలిపివేసింది అయితే దీని ముద్రణ జనవరి 2015లో పునఃప్రారంభించబడగా..  అయితే ఇది మార్కెట్ లో కొత్తగా వచ్చింది. కానీ కొత్తగా ప్రింట్ చేసిన రూపాయి నోటు కాకుండా.. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు ముద్రించబడిన 1 రూపాయి నోటుతో కోటీశ్వరులు కావచ్చు. 

Also Read: Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!

ఈ నోటు ఎందుకు అంత స్పెషల్..??
కేవలం 1 రూపాయి నోటుకు 7 లక్షల రూపాయల వరకు ఎందుకు అమ్ముడైందనే కదా మీ సందేహం.. స్వాతంత్య్రానికి ముందు అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకం చేసిన ఏకైక నోటు ఇదే కావడం విశేషం. ఈ నోటు 80 ఏళ్ల నాటిది కాగా...   దీనిని 1935లో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది. ఇది కాకుండా 1966 నాటి ఒక రూపాయి నోటు విలువ రూ. 45 మరియు 1957 నోటు రూ. 57కే లభ్యమవుతోంది.

ఈ నోట్లను ఎలా విక్రయించవచ్చు.. 
1) మీ వద్ద ఇలాంటి ప్రత్యేక నోట్లు ఉంటే, మీరు దానిని ఆన్‌లైన్‌లో OLXలో విక్రయించవచ్చు.

2) ఈ వెబ్‌సైట్‌లో అరుదైన నోట్లకు భారీ మొత్తంలో చెల్లించి కొనుక్కుంటున్నారు. 

3) ఈ పాత నోట్లను, నాణేలను అమ్మటానికి ముందుగా OLX లో అమ్మేవారిగా నమోదు చేసుకోండి.

Also Read: Venkatesh New Movie : మరో మలయాళ మూవీ రీమేక్‌లో వెంకటేశ్‌, డ్రైవింగ్ లైసెన్స్‌లో హీరోగా వెంకీ

4) తర్వాత, నోటు రెండు వైపుల ఫోటో తీసి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయండి. 

5) ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ IDని నమోదు చేయండి.

6) వెబ్‌సైట్‌లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి.

7) కొనాలనుకునే వారు ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తారు.

ఇలాంటి పాత నోట్లు మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి.. 
మీకు గనుక ఇలాంటి పాత నోట్లు సేకరించే అలవాటు ఉంటే.. మీరు లక్షల్లో సంపాదించవచ్చు. మీ దగ్గర ఉన్న నోట్లను eBayలో అమ్మవచ్చు. 1949, 1957 మరియు 1964 సంవత్సరాలకు చెందిన 59 నోట్లకు మీరు పూర్తిగా రూ. 34,999 పొందవచ్చు. అదే సమయంలో, మీరు 1957 నాటి ఒక రూపాయి నోటు కట్ట నుండి 15 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ విధంగా, ఈ కొన్ని ప్రత్యేక నోట్లు మిమ్మల్ని ఇంట్లో కోటీశ్వరులను చేయగలవు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News