Multiple Bank Accounts: మీరు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నారా.. అయితే దానివల్ల చాలానే నష్టాలు ఉన్నాయి. ఆర్థిక నష్టంతో పాటు ఖాతాల నిర్వహణలో సమస్యలు తలెత్తవచ్చు. ట్యాక్స్ అడ్వైజర్స్, ఇన్వెస్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్ ప్రకారం ఒకే ఖాతా కలిగి ఉండటం బెస్ట్ ఛాయిస్. ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలతో ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
నిర్వహణ భారం.. :
ప్రతీ బ్యాంకు ఖాతాకు సర్వీస్ ఛార్జ్, ఎస్ఎంఎస్ ఛార్జ్, మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఛార్జ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలను వాడుతున్నట్లయితే వీటి రూపంలో మరింత భారం పడుతుంది. ప్రతీ ఖాతాకు ఈ ఛార్జీలన్నీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆర్థికంగా మీపై భారం మోపుతుంది.
ఐటీ రిటర్న్స్‌లో సమస్యలు :
ఒకే బ్యాంకు ఖాతా ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం సులభమని ట్యాక్స్ నిపుణులు చెబుతుంటారు. ఒకే ఖాతా కలిగి ఉన్నట్లయితే మీ ఆర్థిక లావాదేవీల సమాచారమంతా అక్కడే లభిస్తుంది. కానీ వేర్వేరు ఖాతాలు కలిగి ఉన్నట్లయితే... వాటిల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది కాస్త క్లిష్టతరమైన ప్రక్రియ.
అకౌంట్ క్లోజ్ అయ్యే ఛాన్స్
ఒక సంవత్సరం పాటు సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాలో ఎలాంటి లావాదేవీ జరగనట్లయితే అది ఇన్‌యాక్టివ్ బ్యాంక్ ఖాతాగా మారుతుంది. రెండేళ్లపాటు లావాదేవీలు జరగకపోతే అది డోర్మాంట్ ఖాతా లేదా ఇన్‌ఆపరేటివ్‌గా మార్చబడుతుంది.
అదనపు బాదుడు :
ప్రైవేట్ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఛార్జీ రూపంలో భారీ మొత్తాన్ని కస్టమర్లపై బాదుతుంటాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీలో కనీస బ్యాలెన్స్ రూ.10000 ఖాతాలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది రూ.5000గా ఉంది. ఒకవేళ మీరు ఈ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనట్లయితే.. త్రైమాసికానికి రూ.750 చొప్పున జరిమానా తప్పదు.
ఇలా కూడా నష్టమే :
ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నట్లయితే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేందుకే వేల రూపాయలు అవసరమవుతాయి. దానికి బదులు ఆ డబ్బును ఇతరత్రా వాటిల్లో పెట్టుబడి కింద పెట్టినా మీకు వడ్డీ లభిస్తుంది. కాబట్టి ఆవిధంగానూ నష్టమే. ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం ద్వారా తరచూ నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్ విషయంలో కన్ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: Sri Lanka Petrol: మరోసారి భారీగా పెరిగిన చమురు ధరలు.. లీటర్ పెట్రోల్ రూ.420, డీజిల్ రూ.400!
Also Read: Mini AC Cooler: అమెజాన్ లో రూ.6 వేలకే అందుబాటులో పోర్టబుల్ ఏసీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook