India -Canada Row: భారత్ కెనడా మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉండే వాణిజ్య సంబంధాల పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కెనడాకు చెందిన ప్రముఖ ఫండ్ హౌస్ కెనడియన్ పెన్షన్ ఫండ్స భారత్ లో అనేక రకాల స్టార్ట్ అప్‌లతో సహా పలు కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు భారతదేశంలో రూ. 1.74 లక్షల కోట్ల పెట్టుబడి వివిధ రంగాల్లో, వివిధ వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసింది. అంతేకాదు ఈ ఫండ్ హౌస్ తో పాటు ఇన్వెస్ట్ ఇండియా సంస్థ అందించిన సమాచారం ప్రకారం, 600 కంటే ఎక్కువ కెనడా కంపెనీలు భారతదేశంలో ఉనికిని కలిగి ఉన్నాయి. 1,000 కంటే ఎక్కువ కెనడా కంపెనీలు భారతీయ మార్కెట్లో చురుకుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి.
కెనడా పెన్షన్ ప్లాన్ ఫండ్ హౌస్ భారతదేశంలోని ప్రముఖ స్టార్టప్ డిజిటల్ కంపెనీలైన Paytm, Zomato, Nykaa, Delhivery వంటి బిజినెస్ లతో పాటు, ఐటీ కంపెనీలు Infosys, Wipro సహా ఐసీఐసీఐ బ్యాంక్ వంట దిగ్గజ కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టింది. రోడ్లు, హైవేలు, టెలికాం టవర్లు, రియల్ ఎస్టేట్ వంటి భారతీయ మౌలిక సదుపాయాల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ అతిపెద్ద పెట్టుబడిదారులలో ఒకటిగా ఉంది. ఇది ఇటీవలే హ్యుందాయ్ మోటార్స్ ఇండియా IPO లో యాంకర్ ఇన్వెస్టర్‌గా పెట్టుబడి పెట్టింది . ఇది ఫ్లిప్‌కార్ట్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్‌లో కూడా పెట్టుబడి పెట్టింది.
భారత్-చైనాల మధ్య దౌత్యపరంగా ఎన్ని ఘర్షణలు ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు దేశాలు సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కెనెడా విషయంలో కూడా వాణిజ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ మింట్ బిజినెస్ పోర్టల్ కు తెలిపారు. దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌పై భారత్ - కెనెడా దౌత్య పోరు పెద్ద ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అంటున్నారు. భారతదేశం-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినడం స్వల్ప కాలం మాత్రమే సెంటిమెంట్ ను ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. అయితే దీర్ఘకాలికంగా మాత్రం అది సాధ్యం కాదని పేర్కొన్నారు.
ఇటీవల కెనడా పెన్షన్ ప్లాన్ ఫండ్ హౌస్ తర్వాత అతిపెద్ద ఇన్వెస్టర్ గా బ్రిటీష్ కొలంబియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ హౌస్ భారతదేశంలో తన మొదటి ప్రత్యక్ష పెట్టుబడిని టవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రిలయన్స్ జియో)లో సహ-పెట్టుబడిదారుగా ఉంది. అలాగే రోడు, హైవేస్ నిర్మాణ సంస్థ క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌లో సైతం ఇది పెట్టుబడి పెట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter