RBI new rules: ఆన్​లైన్​ లావాదేవీలా? ఆర్​బీఐ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

RBI new rules: ప్రస్తుతం ఏదైనా ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లో లావాదేవీ జరిపితే.. అందులో పేమెంట్ వివరాలు సేవ్​ అవుతాయి. కానీ ఇకపై అలా కుదరదు. యూజర్ల పేమెంట్​ వివరాలు సేవ్​ చేసుకోకుండా.. 2022 నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది ఆర్​బీఐ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 01:34 PM IST
  • 2022 జనవరి నుంచి ఆర్​బీఐ కొత్త రూల్స్​
  • మరింత సురక్షితం కానున్న ఆన్​లైన్​ చెల్లింపులు
  • వచ్చే ఏడాది నుంచి కార్డ్స్​ సేవ్ ఆప్షన్ తొలగింపు
RBI new rules: ఆన్​లైన్​ లావాదేవీలా? ఆర్​బీఐ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

RBI New Rules: ఆన్​లైన్​ చెల్లింపులు మరింత సురక్షితం (Safe online transactions) చేయడంలో భాగంగా ఆర్​బీఐ (RBI) కొత్త నిబంధనలను తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ-కామర్స్ దిగ్గజాలు, ఇతర ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లు తమ పేమెంట్ గేట్​వేలలో వినియోగదారుల క్రెడిట్​, డిబిట్​ కార్డ్​ల వివరాలు సేవ్​ చేసుకోకుండా నియంత్రించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా సంస్థలు తమ గేట్​వేల నుంచి యూజర్ల పేమెంట్ వివరాల డేటా బేస్​ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 1 నుంచి ఈ నిబంధనలు తప్పనిసరి కానున్నాయి.

కొత్త నిబంధనల ఏం చెబుతున్నాయి..

2022 జనవరి 1 నుంచి ఎవరైనా ఆన్​లైన్ లావాదేవీలు జరపాలంటే.. తమ క్రెడిట్​, డెబిట్​ కార్డ్ వివరాలు ప్రతి సారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇబ్బందికరమని భావిస్తే.. టోకనైజేషన్ (Tokenisation) పద్దతిని ఎంచుకోవచ్చు.

ఏమిటి ఈ టోకనైజేషన్​ (What is Tokenisation)..

భౌతికంగా క్రెడిట్​, డెబిట్​ కార్డులకు ప్రత్యామ్నాయంగా ఈ టోకనైజేషన్​ను చెప్పవచ్చు. కార్డ్​ వివరాలకు బదులు ఇందులో ఓ కోడ్ ఉంటుంది. దీనినే టోకెన్​ అంటారు. ఆన్​లైన్ లావాదేవీలు చేసేటప్పుడు ఈ కోడ్​ను ఇస్తే సరిపోతుంది.

ఇది వినియోగదారుల కార్డలకు సంబంధించి ఒక రిఫరెన్స్ మాత్రమే. కాబట్టి ఈ వివరాలను బయటకు తెలిసినా సమస్య ఉండదు. ఈ పద్ధతిలో అదనపు వెరిఫికేషన్ ద్వారా పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది పూర్తి సురక్షితంగా ఉంటుందని భావిస్తోంది ఆర్​బీఐ.

మరిన్ని వివరాలు..

  • 2022 జనవరి 1 నుంచి ఏ ప్లాట్​ఫామ్​ కూడా క్రెడిట్​, డెబిట్​ కార్డ్ వివరాలను సేవ్​ చేసుకోలేవు
  • టోకనైజేషన్ ద్వారా ఒకసారి కార్డు వివరాలను ఏదైనా ప్లాట్​ఫామ్​కు సమర్పిస్తే.. వాటిని భవిష్యత్​ లావాదేవీలకు సమర్పించొచ్చు
  • ఆర్​బీఐ ఆదేశాలతో ఇప్పటికే రూపే, మాస్టర్​ కార్డ్​, వీసా సహా పలు ఇతర పేమెంట్ గేట్​వేలు టోకనైజేషన్​ను ప్రారంభించాయి
  • టోకనైజేషన్ సౌకర్యం కోసం వినియోగదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు
  • దేశీయ లావాదేవీలకు మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. అంతర్జాతీయ లావాదేవీలకు ఈ రూల్స్ వర్తించవు
  • టోకనైజేషన్​ను వినియోగించుకోవడం కస్టమర్ల ఐచ్ఛికమే. ఇబ్బంది లేదు అనుకుంటే ప్రతి సారీ మాన్యూవల్​గా కార్డ్ వివరాలను ఎంటర్ చేసి పేమెంట్ చేయొచ్చు

Also read: Flipkart Bumper Offer: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫోన్ కేవలం 5 వేలకే..మరి కొద్దిగంటలే మిగిలింది

Also read: Go First Offering Discount: రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే విమాన ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News