Cash Deposit Rules: ఆర్ధిక లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధిస్తోంది. అక్రమ, అనధికారిక లావాదేవీల నియంత్రణలో భాగంగా క్యాష్ డిపాజిట్లపై నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి..
తరచూ నగదు లావాదేవీలు చేసేవారికి తస్మాత్ జాగ్రత్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కొత్త నిబంధనలు జారీ చేసింది. కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయాల మేరకు సీబీడీటీ జారీ చేసిన ఆంక్షల ప్రకారం ఇక నుంచి నగదు డిపాజిట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనధికారిక నగదు లావాదేవీలు, అక్రమ లావాదేవీల్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా క్యాష్ లిమిట్ నిబంధనలు సవరిస్తోంది. అనుమతించిన పరిమితికి మించి నగదు పొందినా లేదా పంపించినా సంబంధిత నగదుపై వంద శాతం వరకూ పెనాల్టీ విధించే అవకాశాలున్నాయి.
ఇప్పుడు సీబీడీటీ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా డిపాజిట్లు ఏడాది వ్యవధిలో 20 లక్షలు మించకూడదు. అలా మించితే పాన్, ఆధార్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో రోజుకు 50 వేలు దాటి డిపాజిట్ చేస్తే పాన్ వివరాలు సమర్పించాల్సి వచ్చేది. ఆ పరిమితి ఇప్పుడు ఏడాదికి చేసింది ఇన్‌కంటాక్స్ శాఖ. ఈ కొత్త నిబంధనల ప్రకారం పెద్ద మొత్తంలో సింగిల్ లేదా మల్టీ బ్యాంక్స్ ద్వారా ఏడాది వ్యవధిలో నగదు విత్‌డ్రా లేదా డిపాజిట్లకు పాన్, ఆధార్ కార్డు వివరాలు సమర్పించాల్సిన పరిస్థితి.
పాన్‌కార్డు లేని వ్యక్తులు రోజుకు 50 వేలకు మించి లేదా ఏడాదిలో 20 లక్షలకు మించి డిపాజిట్ చేయాల్సి వస్తే..అటువంటి లావాదేవీకు 7 రోజుల ముందు పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆర్ధిక నేరాలు, మోసాలు, అక్రమ నగదు లావాదేవీల్ని నియంత్రించేందుకు ఆదాయపు పన్నుశాఖ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖలు కలిసి ఎప్పటికప్పుడు నిబంధనలు అప్డేట్ చేస్తున్నాయి.
ఎవరైనా సరే ఎక్కడ్నించైనా ఒకేసారి రెండు లక్షల కంటే ఎక్కువ నగదు పొందేందుకు అనుమతి లేదు. కుటుంబ సభ్యుడి నుంచి కూడా ఆస్కారం లేదు. ఎక్కడైనా నగల కొనుగోలు సందర్భంలో సింగిల్ లావాదేవీ 3 లక్షలుంటే..చెక్, క్రెడిట్ కార్డు,డెబిట్ కార్డు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది.
Also read: Passport Re Issue: మీ పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయిందా..కొత్తది ఇలా రీ ఇష్యూ చేసుకోవచ్చు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook