Car for Sale: కేవలం రూ.50 వేలు, అంతకన్నా తక్కువ ధరకే అమ్మకానికి కార్లు.. పూర్తి వివరాలివే..

Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా.. కేవలం రూ.50 వేలు లోపు ధరలో మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ సైట్‌లో పలు కార్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 21, 2022, 03:38 PM IST
  • సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా
  • చౌక ధరకే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొన్ని కార్లు అందుబాటులో ఉన్నాయి
  • మారుతీ సుజుకీ ట్రూ సైట్స్‌లో సెకండ్ హ్యాండ్ కార్స్
Car for Sale: కేవలం రూ.50 వేలు, అంతకన్నా తక్కువ ధరకే అమ్మకానికి కార్లు.. పూర్తి వివరాలివే..

Second Hand Cars in Low Price: ఈరోజుల్లో మధ్య తరగతి కుటుంబాల్లో కార్ల వినియోగం బాగా పెరిగింది. సొంతిల్లు తర్వాత మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నది కారునే. షోరూమ్ కాకపోయినా సెకండ్ హ్యాండ్ కారైనా సరే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది బిజినెస్ పరంగానూ సెకండ్ హ్యాండ్ కార్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ కూడా బాగా పెరిగింది. అయితే సెకండ్ హ్యాండ్ కారనగానే దాని కండిషన్‌పై అనేక సందేహాలు ఉంటాయి. మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ లాంటి సైట్స్ ద్వారా తక్కువ ధరలో మంచి కండిషన్‌తో ఉన్న కార్లు ఎంచుకోవచ్చు. ప్రస్తుతం మారుతీ సుజుకీ ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో చౌక ధరలో అందుబాటులో ఉన్న కొన్ని కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

కేవలం రూ.35 వేలకే మారుతీ 800

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మారుతి 800 STD కారు విక్రయానికి ఉంది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ.35000గా చెబుతున్నారు. ఇది 2007 మోడల్ కారు. ఇది 82,456 కిలోమీటర్లు ప్రయాణించింది. కాన్పూర్ రిజిస్ట్రేషన్‌తో ఉంది. ప్రస్తుతం మారుతీ సుజుకీ వాల్యూ సైట్‌లో దీన్ని అమ్మకానికి ఉంచారు.

కేవలం రూ.46 వేలకే మారుతీ ఆల్టో

హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో మారుతి ఆల్టో LXI అమ్మకానికి ఉంది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ.46 వేలుగా చెబుతున్నారు. ఇది కూడా 2007 మోడల్ కారు. 1,90,000 కి.మీలు నడించింది. ఇది థర్డ్ హ్యాండ్ కారు. బహదూర్‌ఘర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉంది.

కేవలం రూ.49 వేలకే మారుతీ ఆల్టో ఎల్ఎక్స్‌ఐ

హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో మరో మారుతి ఆల్టో LXI కారు అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు ధర రూ.49 వేలుగా చెబుతున్నారు. ఇది 2009 మోడల్ కారు. ఇప్పటివరకూ 1,09,233 కి.మీ ప్రయాణించింది. కారు నంబర్ బహదూర్‌ఘర్‌ రిజిస్ట్రేషన్‌తో ఉంది.

మారుతీ 800, రూ.50 వేలు :

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మారుతి 800 STD విక్రయానికి ఉంది. దీని ధర రూ.50 వేలుగా చెబుతున్నారు. ఇది పెట్రోల్ ఇంజిన్ ఉన్న 2011 మోడల్ కారు. ఇప్పటివరకూ 1,11,480 కి.మీ ప్రయాణించింది. ఇది థర్డ్ హ్యాండ్ కారు. జోధ్‌పూర్ రిజిస్ట్రేషన్‌తో ఉంది.

Also Read: Presidential Election Result-LIVE Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..బీజేపీ నేతల సంబరాలు..!

Also Read: Congress Protest: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు..బెంగళూరులో కారుకు నిప్పు..!

Congress Protest: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు..బెంగళూరులో కారుకు నిప్పు..!

 

Trending News