Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!

Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్‌కి చెందిన సిద్ధార్థ్ సెడానీ,LKP సెక్యూరిటీస్‌కి చెందిన కునాల్ షా రికమెండ్ చేసిన రెండు స్టాక్స్ పై మీరు ఓ కన్నేయండి. ఈ స్టాక్ రికమండేషన్ వెనుక ఉన్న కారణాలను తెలుసుకుందాం.

Written by - Bhoomi | Last Updated : Jul 22, 2024, 05:33 PM IST
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!

Budget 2024:  కేంద్ర బడ్జెట్, మంగళవారం జూలై 23న సమర్పించనున్నారు. బడ్జెట్ ముందు తర్వాత  స్టాక్ మార్కెట్‌లో కొన్ని హెచ్చు తగ్గులు అనేవి సహజం. బడ్జెట్ అనంతరం మార్కెట్ భారీ ఒడిదుడుకులకు లోనవుతుందా, లేక మార్కెట్‌ పాజిటివ్ గా రియాక్ట్ అవుతుందా అనేది మరో 24 గంటల తర్వాత కానీ తెలియదు. అయితే సాధారణంగా బడ్జెట్ కు ముందు నిపుణులు కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ రికమండ్ చేస్తుంటారు. మీరు బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్ నుంచి  లాభాలను పొందాలనుకుంటే మాత్రం జీ బిజినెస్ ప్రసారం చేసిన బడ్జెట్ మై పిక్ సిరీస్‌లో, మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేకమైన స్టాక్ష్ రికమండ్ చేశారు. ఆనంద్ రాఠీ సెక్యూరిటీస్‌కి చెందిన సిద్ధార్థ్ సెడానీ, LKP సెక్యూరిటీస్‌కి చెందిన కునాల్ షా తమ రెండు స్టాక్‌లను రికమండ్ చేశారు. ఈ స్టాక్స్ కేవలం ఏడాది వ్యవధిలో మంచి రిటర్న్స్ అందించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Welspun Living Ltd:

LKP సెక్యూరిటీస్‌కు చెందిన కునాల్ షా టెక్స్‌టైల్ స్టాక్ Welspun Living బయ్ రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్టాక్ రూ.173 వద్ద ట్రేడవుతోంది. అయితే అతి తక్కువ వ్యవధిలోనే ఈ స్టాక్ ధర రూ.195 నుంచి 210 టార్గెట్ చేరుకునే వీలుందని అంచనా వేశారు. అలాగే ఈ స్టాక్ స్టాప్‌లాస్‌ను రూ.137గా నిర్ణయించారు. స్టాక్ టెక్నికల్ చార్ట్‌లలో మంచి బేస్ ఫార్మేషన్‌ను ఏర్పరుచుకుంది. లాంగ్ టర్మ్ చార్ట్‌లలో బ్రేక్అవుట్ సంకేతాలు కనిపిస్తున్నాయి.  మొమెంటం ఇండికేటర్ కూడా బుల్లిష్ అవకాశాలను సూచిస్తోంది. కాబట్టి ఇక్కడ నుండి కొనుగోళ్లు చేయడం మంచిది.

Also Read : Wipro's Share Price Falls: విప్రో షేర్లు ఢమాల్...Q1లో తప్పిన అంచనాలే కారణం..!!  

Amber Enterprises India:

ఆనంద్ రాఠీ షేర్స్‌కు చెందిన సిద్ధార్థ్ సెడానీ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తాజాగా అంబర్ ఎంటర్‌ప్రైజెస్ షేర్లపై బయ్ రేటింగ్ అందించారు.  ప్రస్తుతం ఈ స్టాక్ రూ.4,220 వద్ద ట్రేడవుతోంది. లాంగ్ టర్మ్ వ్యూను దృష్టిలో ఉంచుకొని టార్గెట్ ధర 5,100 స్థాయిలో ఉంచారు. ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ స్పేస్‌లో ఉంది, ముఖ్యంగా రూమ్ AC విభాగంలో కాంట్రాక్ట్ తయారీని చేస్తోంది. ఈ రంగం తయారీ, ఎగుమతులకు సంబంధించిన బడ్జెట్ లో వచ్చే కీలక ప్రకటనల ద్వారా  మద్దతు పొందవచ్చు. AC పరిశ్రమ ప్రతీ ఏడాది 16% పెరుగుతోంది. డిమాండ్ పెరుగుదల కారణంగా, కంపెనీకి మంచి భవిష్యత్తు ఉందని రికమండ్ చేశారు. 

Also Read : Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News