Union Budget 2023: ఈసారి బడ్జెట్‌లో ఏ రంగంలో ఎంతవరకూ ఉపశమనం, ఏయే వెసులుబాట్లు

Union Budgt 2023: మరి కొద్దిరోజుల్లోనే కేంద్ర బడ్జెట్ రానుంది. ఈసారి బడ్జెట్ పై సాధారణ ప్రజల్నించి మొదలుకుని అందరికీ చాలా ఆశలున్నాయి. వివిధ రంగాలకు ఉపశమనం కలిగేలా వరాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2023, 04:08 PM IST
Union Budget 2023: ఈసారి బడ్జెట్‌లో ఏ రంగంలో ఎంతవరకూ ఉపశమనం, ఏయే వెసులుబాట్లు

కేంద్ర ప్రభుత్వం త్వరలో అంటే మరో 15 రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందనే విషయంపై విభిన్న వర్గాల్లో విభిన్న రకాల అంచనాలున్నాయి. ముఖ్యంగా పేదలు, మధ్య తరగతి, సామాన్య ప్రజలు చాలా ఆశలున్నాయి. 2023-24 బడ్జెట్‌ను ప్రత్యేకంగా చేసేందుకు వివిధ రకాల మినహాయింపులు ఇవ్వవచ్చని సమాచారం. 2023-23 బడ్జెట్‌లో ఏ రంగానికి ఏం మేలు జరగనుందనేది తెలుసుకుందాం.

జీడీపీ 7 శాతం చేరవచ్చు

ఐఎంఎఫ్ అందించిన వివరాల ప్రకారం ప్రపంచ ఎకానమీలో ఇండియా ఓ బ్రైట్ స్పాట్‌లో ఎదుగుతోంది. జీడీపీ గణాంకాల గురించి మాట్లాడుకుంటే..2021-22లో 8.7 శాతం ఉండగా, 2022-23 లో 7 శాతం చేరవచ్చని అంచనా.

జీడీపీ గ్రోత్ తక్కువే ఉంటుందా

ఒకవేళ సరఫరా సంబంధిత గ్రాస్ వ్యాల్యూ గురించి మాట్లాడుకుంటే ఇందులో అగ్నికల్చర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్‌ల పాత్ర గణనీయంగా ఉండవచ్చు. గత ఏడాది ఇది 8 శాతం ఉంది. ఈ ఏడాది 6.7 శాతం ఉంది. తాజాగా చేసిన అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జీడీపీ గ్రోత్ రేటు తక్కువగానే ఉండవచ్చు.

మార్కెట్ నిపుణులు అంచనా ఏమిటి

రీసెర్చ్ ఎనాలిస్ట్ ప్రకారం సాధారణ జీడీపీ 2022-23లో 15.4 శాతం ఉంటుంది. 2021-22లో ఇది 19.5 శాతముంది. జీడీపీలో 2022-23లో షేర్ శాతంలో హై కవరేజ్ ఉంటుంది. అంతేకాక ప్రైవేట్ పైనల్ కంజప్షన్ ఎక్స్‌పెండిచర్ 57.2 శాతం ఉండవచ్చు. అదే ప్రభుత్వ ఫైనల్ కంజప్షన్ ఎక్స్‌పెండిచర్ 10.3 శాతం, ఎగుమతి 22.7 శాతం, దిగుమతి 29.7 శాతం ఉండవచ్చు.

ఏ రంగంలో మెరుగుదల

అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ , కన్‌స్ట్రక్చర్, ట్రేడ్, హోటల్ , ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్, సర్వీస్ రంగంలో మెరుగుదల ఉండవచ్చు.

Also read: Realme: రియల్‌మి నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్, కెమేరా, బ్యాటరీ ఫీచర్లు, ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News