Tata Nexon: బ్రెజ్జా, పంచ్, క్రెటా.. అన్నిటిని వెనక్కి నెట్టేసిన టాటా నెక్సాన్!

మన దేశంలో రాను రాను SUV కార్ల వినియోగం పెరగనుంది. ఇక SUV ల విషయానికి వస్తే సెప్టెంబర్ నెలల్లో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. బ్రెజ్జా, పంచ్ మరియు క్రెటాని కూడా వెనక్కి నెట్టింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2023, 02:07 PM IST
Tata Nexon: బ్రెజ్జా, పంచ్, క్రెటా.. అన్నిటిని వెనక్కి నెట్టేసిన టాటా నెక్సాన్!

Top Selling SUV in India: భారతదేశంలో SUV (స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) యొక్క ప్రజాదరణ నిరంతరం పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో SUV కార్ల వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. భారత మార్కెట్లో ఎస్‌యూవీలు బాగా అమ్ముడవుతున్నాయి. సెప్టెంబర్ నెలలో టాటా నెక్సాన్ SUV విభాగంలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉంది. ఇది బ్రెజ్జా, పంచ్ మరియు క్రెటా వంటి అన్ని SUVలను దాటేసింది. టాటా నెక్సాన్ సెప్టెంబర్‌లో మొత్తం 15,325 యూనిట్లు విక్రయించి దేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. కాగా, సెప్టెంబర్ 2022లో నెక్సాన్ 14,518 యూనిట్లు అమ్మబడ్డాయి. అంటే వార్షిక ప్రాతిపదికన నెక్సాన్ విక్రయాలు 6 శాతం పెరిగాయి. 

ఆ తర్వాత మారుతీ సుజుకీ బ్రెజా రెండో స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలలో బ్రెజ్జా 15,001 యూనిట్లు విక్రయించబడ్డాయి. దీని తరువాత, టాటా పంచ్ మూడవ స్థానంలో ఉండగా.. ఇది చాలా వేగంగా ప్రజాదరణ పొందింది. సెప్టెంబర్‌లో మొత్తం 13,036 యూనిట్ల పంచ్‌లు విక్రయించబడ్డాయి. దీనితో పాటు, ఇది మూడవ అత్యధికంగా అమ్ముడైన SUV. దీని అమ్మకాలు 6 శాతం (వార్షిక ప్రాతిపదికన) పెరిగాయి. 

దీని తరువాత, హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన SUVలలో నాల్గవ స్థానంలో కొనసాగింది. సెప్టెంబరు 2023లో 12,717 యూనిట్లు విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 12,866 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, వార్షిక ప్రాతిపదికన దాని అమ్మకాలు కొంచెం తగ్గాయి. వీటన్నింటి తర్వాత హ్యుందాయ్ వెన్యూ ఐదో స్థానంలో ఉండగా.. దీని మొత్తం అమ్మకాలు 12,204 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన చూస్తే 11 శాతం వృద్ధిని సాధించింది.

Also Read: Boat Blitz 1500 Price: బిగ్‌ దీపావళి సేల్‌లో boAt Blitz 1500 హోమ్ థియేట‌ర్‌పై 42 శాతం తగ్గింపు!  

సెప్టెంబర్ (2023)లో అత్యధికంగా అమ్ముడైన SUVలు.. 

Top Selling SUV Cars in India
కార్ బ్రాండ్స్  అమ్ముడైన యూనిట్లు 
టాటా నెక్సాన్ 15,325 యూనిట్లు 
మారుతి బ్రెజ్జా 15,001 యూనిట్లు 
టాటా పంచ్ 13,036 యూనిట్లు 
హ్యుందాయ్ క్రెటా 12,717 యూనిట్లు 
హ్యుందాయ్ వెన్యూ 12,204 యూనిట్లు 

Also Read: Data Breach : లీక్ అయినా 81.5 కోట్ల మంది భారతీయుల డేటా …ప్రభుత్వం అప్రమత్తం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News