Best Selling 7 Seater: మారుతి ఎర్టిగాను తలదన్నిన మరో 7 సీటర్, ధర కేవలం 6.5 లక్షలే

Best Selling 7 Seater: మారుతి సుజుకి కార్లంటే అందరికీ క్రేజ్ ఎక్కువ. దేశ ప్రజల ఆదరణ చూరగొన్న బ్రాండ్ అది. సెడాన్ కారు కావచ్చు, 7 సీటర్ కావచ్చు, ఎస్‌యూవీ కావచ్చు బ్రాండ్ మారుతి సుజుకి అయితే చాలు. ఒక్కోసారి మారుతి కంపెనీ కార్లే ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 31, 2023, 08:15 PM IST
Best Selling 7 Seater: మారుతి ఎర్టిగాను తలదన్నిన మరో 7 సీటర్, ధర కేవలం 6.5 లక్షలే

Best Selling 7 Seater: మారుతి సుజుకి కంపెనీకు 7 సీటర్ కార్లలో అత్యంత ఆదరణ పొందిన కారు మారుతి ఎర్టిగా. చాలాకాలం నుంచి అత్యధిక విక్రయాలు నమోదు చేస్తోంది. అయితే జూన్ నెలలో మరో 7 సీటర్ కారు ఎర్టిగాను వెనక్కి నెట్టేసి అందర్నీ ఆశ్చర్చపర్చింది. ఈ కారు ధర కూడా ఎర్టిగాతో పోలిస్తే చాలా తక్కువ.

జూన్ నెల విక్రయాలు పరిశీలిస్తే మారుతి సుజుకి కంపెనీకు చెందిన వేగన్ ఆర్ విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మారుతి స్విఫ్ట్ రెండవ స్థానంలో నిలవగా హ్యుండయ్ క్రెటా మూడవ స్థానంలో ఉంది. హ్యాచ్‌బ్యాక్, ఎస్‌యూవీలతో పాటు 7 సీటర్ కార్లకు ప్రస్తుతం డిమాండ్ నడుస్తోంది. అందుకే మారుతి ఎర్టిగా బెస్ట్ సెల్లింగ్‌గా నిలుస్తూ వచ్చింది. కానీ ఇటీవల జూన్ నెలలో మాత్రం మారుతి ఎర్టిగా వెనకబడిపోయింది. ఎర్టిగా టాప్ వేరియంట్ ధర 13 లక్షల రూపాయలు కాగా, ఎర్టిగాను తలదన్నిన కారు ధర కేవలం 6.5 లక్షలే.

మారుతి సుజుకి కంపెనీకు చెందిన ఈకో ఇప్పుడు బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కారుగా నిలిచింది. జూన్ నెలలో మారుతి సుజుకి ఈకో కారు 9.354 యూనిట్లు అమ్మకాలు సాధించింది. ఓవరాల్ కార్ల అమ్మకాల్లో 11వ స్థానాన్ని దక్కించుకుంది. బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ విభాగంలో ఎర్టిగా ఈసారి రెండవ స్థానానికి పడిపోయింది. జూన్ నెలలో మారుతి ఎర్టిగా 8,422 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. మారుతి ఈకో అమ్మకాలు పెరగడానికి కారణం ఒకే ఒకటి. అది ధర. ఎర్టీగా టాప్ వేరియంట్ ధర 13 లక్షలైతే ఈకో టాప్ వేరియంట్ ధర 6.5 లక్షలే. అంటే సగానికి సగం. పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. 

మారుతి సుజుకి ఈకోలో 1.2 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటి ఇంజన్ ఉన్నాయి. ఇది 80.76 పీఎస్ శక్తిని, 104.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇందులో సీఎన్జీ వేరియంట్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 71.65 పీఎస్ పవర్, 95 ఎన్ఎం టార్గ్ ఉత్పత్తి చేయగలదు. ఇక మైలేజ్ విషాయనికొస్తే మారుతి సుజుకి ఈకో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 20.20 కిలోమీటర్లు ఇస్తే సీఎన్జీ వెర్షన్ 27.05 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఇందులోనే పాసెంజర్ వేరియంట్ పెట్రోల్ అయితే 19.71 కిలోమీటర్లు, సీఎన్జీ అయితే 26.78 కిలోమీటర్లు ఇస్తుంది. 

Also read: Hyundai Creta: మీకు నచ్చిన హ్యుండయ్ క్రెటా కారు కేవలం 8 లక్షలే ఇప్పుడు, ఎక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News