Best Saving Schemes: స్వల్ప వ్యవధిలోనే డబ్బు రెట్టింపయ్యే పథకాలివే

Best Saving Schemes: సేవింగ్ పథకాలు లేదా పెట్టుబడుల గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ స్వల్ప వ్యవధిలో డబ్బులు రెట్టింపయ్యే సురక్షితమైన స్కీమ్స్ ఏమున్నాయో చాలామందికి తెలియవు. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2022, 11:04 PM IST
Best Saving Schemes: స్వల్ప వ్యవధిలోనే డబ్బు రెట్టింపయ్యే పథకాలివే

Best Saving Schemes: సేవింగ్ పథకాలు లేదా పెట్టుబడుల గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ స్వల్ప వ్యవధిలో డబ్బులు రెట్టింపయ్యే సురక్షితమైన స్కీమ్స్ ఏమున్నాయో చాలామందికి తెలియవు. ఆ వివరాలు మీ కోసం..

కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టాలనుకుంటే..చాలా ఆలోచించాలి. స్వల్ప వ్యవధిలో లాభాలు ఎక్కువగా రావడమే కాకుండా..పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ అవసరమౌతుంది. అందుకు పోస్టాఫీసు పథకాలు అత్యుత్తమం. మీ డబ్బులు కొద్ది సంవత్సరాల్లో రెట్టింపయ్యే కొన్ని పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పోస్టాపీసు పధకాల్లో మీ డబ్బు ఎప్పుడూ క్షేమమే. అంటే మీరు నష్టపోరు. పోస్టాఫీసులో సేవింగ్స్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇందులో డబ్బులు పెడితే..త్వరలోనే ఆ డబ్బు రెట్టింపవుతుంది. ఆ పథకాలను పరిశీలిద్దాం..

పోస్టాఫీసుకు సంబంధించిన నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌పై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది ఐదేళ్ల సేవింగ్ స్కీమ్. ఇందులో పెట్టుబడితో ఇన్‌కంటాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ఈ వడ్డీను లెక్కేస్తే పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మరో పోస్టాఫీసు పథకం సుకన్య సమృద్ది యోజన. ఈ స్కీమ్‌పై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. అమ్మాయిల కోసం ఈ పథకం ప్రారంభించారు. ఇందులో డబ్బులు డబుల్ అయ్యేందుకు దాదాపు 9-10 ఏళ్లు పడుతుంది. ఇక మరో పధకం పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ స్కీమ్. ఇందులో ప్రస్తుతం 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ స్కీమ్ ప్రకారం మీ డబ్పులు రెట్టింపయ్యేందుకు 9-10 ఏళ్లు పడుతుంది. 

ఇక 15 ఏళ్ల పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే ఈ రేటుతో మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపు 10 ఏళ్లు పడుతుంది. ఇక మరో పధకం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కం స్కీమ్. ఇందులో ప్రస్తుతం లభిస్తున్న 6.6 వడ్డీ ప్రకారం మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపుగా 11 ఏళ్లు పడుతుంది. పోస్టాఫీసు సేవింగ్ బ్యాంక్ ఎక్కౌంట్‌లో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే..మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దీర్ఘకాలం నిరీక్షించాలి. ఇందులో కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు ఏకంగా 18 ఏళ్లు పట్టవచ్చు.

మరో ఆకర్షణీయమైన పథకం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకం. ఇందులో 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 12 న్నర ఏళ్లు పట్టనుంది. పోస్టాఫీసులో ఏడాది నుంచి మూడేళ్ల వ్యవధికి టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. ఇందులో 5.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు 13 ఏళ్లు పడుతుంది. అదే విధంగా ఐదేళ్లకు పెడితే 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన మీ డబ్బులు రెట్టింపయ్యేందుకు దాదాపుగా 11 ఏళ్లు పట్టవచ్చు.

Also read: Aadhaar Card Security: ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచనలు, సురక్షితంగా ఉంచుకోవడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News