Future Savings Plan Mistakes: తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు అనేక ప్లాన్లు వేస్తున్నారు. ఆ స్కూల్‌లో చదవించాలి.. ఈ ఆటలు ఆడించాలి.. ఇతర యాక్టివిటీస్ కూడా నేర్పించాలంటూ రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలని నిరంతరం తపన పడుతుంటారు. ఓ వైపు ఉన్నత చదువును అందిస్తూ.. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే పొదుపు చేసే సమయంలో తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ తప్పులతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి ఏంటంటే..
మీ కోసం కూడా ఆలోచించండి..
పిల్లల భవిష్యత్ కోసం తాపత్రయ పడుతున్న క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు తమ వృద్ధాప్యం గురించి ఆలోచించడం మరచిపోతున్నారు. పిల్లల కోసం వివిధ పొదుపు పథకాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ.. తమ కోసం ఎటువంటి పాలసీ తీసుకోరు. ఇది అతిపెద్ద తప్పు. దీని కారణంగా చాలా మంది రిటైర్మెంట్ తరువాత బాధపడుతున్నారు. మీరు మీ పిల్లల కోసం ఒక పాలసీ తీసుకుంటే.. మీ రిటైర్మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని మీ కోసం కూడా ఒక పాలసీ తీసుకోండి.
ఖర్చులను దృష్టిలో ఉంచుకుని..
ఖర్చులు ఎప్పుడు పెరుగుతుంటాయి. అవి ఎప్పుడు తగ్గవు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉంటాయి. పొదుపు పథకంలో ఇన్వెస్ట్ చేసే ముందు.. 15-20 ఏళ్ల తరువాత ఉండే ఖర్చులను దృష్టిలో ఉంచుకోండి. మీరు చిన్న తరహా పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే తరువాత పెద్దగా ప్రయోజనం లేదని బాధపడతారు.
ఎక్కువగా ఆలోచిస్తున్నారా..?
ముందు సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలా..? వద్దా..? అని చాలా మంది డైలామాలో ఉంటారు. ఏ పథకంలో పెట్టుబడి పెట్టాలి..? మన డబ్బులు మనకు వస్తాయా..? అని సందేహ పడుతుంటారు. ఈ విషయంలో ఎక్కువ ఆలోచించకుండా మీరు సాధ్యమైనంత త్వరగా పెట్టుపెడి పెట్టడం ప్రారంభించండి. తక్కువ సమయంలోనే మెచ్యురిటీ డబ్బులు మీ చేతికి వస్తాయి.
అవసరాన్ని బట్టి..
ఏదైనా సేవింగ్స్ స్కీమ్ మీ అవసరాన్ని బట్టి తీసుకోవాలి. ఉదాహరణకు మీ కుమార్తె వివాహం లేదా ఆమె ఉన్నత చదువుల కోసం డబ్బును పొదుపు చేయాలనుకుంటే.. సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. రిస్క్ అయినా పర్లేదు తక్కువ సమయంలో ధనవంతులుగా కావాలని అనుకుంటే.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ పాలసీ మీరు రిటైర్మెంట్ తరువాత సాఫీగా సాగిపోయేందుకు తోడ్పడుతుంది.
బెస్ట్ సేవింగ్స్ స్కీమ్
ఫ్యూచర్ సేవింగ్స్ ప్లాన్‌ను ఎంచుకునేటప్పుడు భవిష్యత్త్‌లో ఖర్చులను కూడా అంచనా వేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు పిల్లలను ఉన్నత చదువుల కోసం పొదుపు పథకం తీసుకోవాలనుకుంటే.. రూ.50 వేలు లేదా ఒక లక్ష సేవింగ్స్ స్కీమ్స్ పనిచేయవు. రాబోయే 10-15 ఏళ్లలో ద్రవ్యోల్బణం చాలా పెరిగుతుంది. మీరు కనీసం రూ.5 లక్షల సేవింగ్స్ స్కీమ్ ఎంచుకుంటే ఉత్తమం.
Also Read: Bandi Sanjay About PM Modi Meeting: మోదీ సభలో BRS పెయిడ్ ఆర్టిస్టులుంటారు జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి