/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Senior Citizen Fixed Deposit Vs Bank FD: ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు తాము పెట్టిన డబ్బులు సురక్షితంగా ఉండాలని.. తమకు ఎక్కువ లాభాలను తీసుకురావాలని అనుకుంటున్నారు. సీనియర్ సిటిజన్లకు పెట్టుపెడి పెట్టేందుకు అనేక ఆఫర్లు ఉన్నాయి. వాళ్లకు సాధారణ వినియోగదారులతో పోలిస్తే.. వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎందులో ఇన్వెస్ట్ చేయాలని కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లేదా సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం..

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనేది రిటైర్‌మెంట్ బెనిఫిట్ ప్లాన్. ఇది 60 ఏళ్లు దాటిన ఒకసారి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే.. వారు మంచి రాబడిని పొందుతారు. ఇక సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ అనేది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ రెండు స్కీమ్స్‌లో లాక్-ఇన్ పీరియడ్ ఒకేలా ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్య కొంత తేడా ఉంటుంది. అందుకే ఈ రెండు పథకాల ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ రెండు పథకాలలో పెట్టుబడికి ఏది మంచిదని ఆలోచిస్తున్నారా..? ఈ రెండు స్కీమ్స్‌ గురించి తెలుసుకోండి. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వివరాలు..

==> ఇది ప్రభుత్వ తీసుకువచ్చిన ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. అందుకే ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బు సురక్షితంగా ఉంటుంది. 
==> పెట్టుబడిదారులు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ బెనిఫిట్‌ను కూడా పొందుతారు. 
==> ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. తరువాత మూడు సంవత్సరాల వరకు పొడగించవచ్చు.
==> ఈ స్కీమ్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేయడం చాలా ఈజీ. దేశంలోని ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి మీరు ఖాతాను తెరవవచ్చు. తరువాత ఏ బ్రాంచ్‌కైనా మార్చుకోవచ్చు. 
==> ఇందులో కనీస డిపాజిట్ మొత్తం రూ.1,000. తరువాత రూ.1,000 గుణిజాలలో పెట్టుబడి పెంచుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ పథకం వివరాలు..

==> సాధారణ వినియోగదారులకు అందించే ఎఫ్‌డీ వడ్డీతో పోలిస్తే బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక వడ్డీని ఆఫర్ చేస్తాయి. సీనియర్ సిటిజన్లకు 0.5 శాతం అదనపు వడ్డీని ఇస్తాయి.
==> పెట్టుబడిదారులు వడ్డీ మొత్తాన్ని పొందేందుకు వివిధ రకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షికంగా వడ్డీని తీసుకోవచ్చు. ప్రతి నెలా వడ్డీ తీసుకోవడం ద్వారా మీ నెలవారీ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
==> కొన్ని ఎఫ్‌డీలపై పన్ను ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్‌లో మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది.

రెండింటి మధ్య తేడా ఏంటి

==> సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది సెక్షన్ 80సీ ట్యాక్స్‌ బెనిఫిట్ కింద వర్తిస్తుంది. అదే మీరు ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. 
==> ఎస్‌సీఎస్‌సీ స్కీమ్‌లో గరిష్ట పెట్టుబడిపై లిమిట్ ఉంటుంది. ఎఫ్‌డీలో మీరు ఇష్టం. ఈ రెండింటిలో ఏదీ ఎంచుకోవాలంటే.. చివరికి పెట్టుబడిదారుడి ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. 

Also Read: HBD Mammootty: బర్త్ డే రోజు భయపెడుతున్న మమ్ముట్టి.. భ్ర‌మ‌యుగం ఫస్ట్ లుక్ రిలీజ్..

Also Read: MLA Etela Rajender: నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Best Investment Schemes Senior Citizen Savings Scheme vs senior citizen fixed deposit Which offers highest interest rate check here details
News Source: 
Home Title: 

Best Investment Schemes: ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? ఈ రెండు స్కీమ్స్‌లో బెస్ట్ ఏదంటే..?

Best Investment Schemes: ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? ఈ రెండు స్కీమ్స్‌లో బెస్ట్ ఏదంటే..?
Caption: 
Best Investment Schemes (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? ఈ రెండు స్కీమ్స్‌లో బెస్ట్ ఏదంటే..?
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, September 7, 2023 - 22:25
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
37
Is Breaking News: 
No
Word Count: 
378