Best Electric Scooter: సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగల్ ఛార్జింగ్‌తో 181 కిలోమీటర్లు! ఎగబడి కొంటున్న జనం

Ola S1 Pro, Ola S1 Electric Scooters sales crossed 1800 units in January 2023. ఓలా గత నెలలో 18,274 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో Ola S1 మరియు Ola S1 ప్రో మోడల్‌లు ఉన్నాయి.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 9, 2023, 01:14 PM IST
  • సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్
  • సింగల్ ఛార్జింగ్‌తో 181 కిలోమీటర్లు
  • ఎగబడి కొంటున్న జనం
Best Electric Scooter: సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగల్ ఛార్జింగ్‌తో 181 కిలోమీటర్లు! ఎగబడి కొంటున్న జనం

Ola S1 Pro Gives 181 KM in Single Charging: భారత దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో నిత్యం కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ విభాగంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే 'ఓలా ఎలక్ట్రిక్' తక్కువ సమయంలోనే మంచి మార్కెట్ ఏర్పరుచుకుంది. దాదాపు ఒక సంవత్సర కాలంలోనే దేశంలోనే నంబర్ వన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థగా నిలిచింది. 2023 జనవరిలో కూడా ఓలా ఎలక్ట్రిక్ తన మార్క్ చూపెట్టింది. వెహికల్ పోర్టల్ ప్రకారం.. ఓలా గత నెలలో 18,274 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇందులో Ola S1 మరియు Ola S1 ప్రో మోడల్‌లు ఉన్నాయి.

ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ప్రీమియం ధర రూ.1.40 లక్షలు. ఈ స్కూటర్‌లో 4kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్‌తో 181 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇందులో హైపర్‌డ్రైవ్ మోటార్ ఉంది. 11.3bhp మరియు 58Nm అవుట్‌పుట్ ఇస్తుంది. ఓలా ఎస్1 ప్రో గరిష్ట వేగం 116kmph. ఈ స్కూటర్ బ్యాటరీని సాధారణ ఛార్జర్ ద్వారా 6.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఓలా ఎస్1 (Ola S1) స్కూటర్‌లో 8.5kW పీక్ అవుట్‌పుట్ మరియు 58Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2.98kW. ఈ బ్యాటరీ ద్వారా ఓలా ఎస్1 గరిష్టంగా 90 kmph వేగాన్ని అందుకుంటుంది. సింగల్ ఛార్జింగ్‌తో 121 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. 

ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్ల ఫీచర్ల జాబితాలో భారీ తేడా ఏమీ ఉండదు. ఈ రెండు షూటర్ల మధ్య వ్యత్యాసం బ్యాటరీ ప్యాక్ మాత్రమే. రెండు మోడళ్లలో ట్విన్-పాడ్ హెడ్‌లైట్లు, ఆప్రాన్-మౌంటెడ్ LED ఇండికేటర్స్, బాడీ-కలర్ ఫ్రంట్ ఫెండర్‌లు, కర్వీ సైడ్ ప్యానెల్‌లు, LED టెయిల్‌లైట్లు ఉంటాయి. వెనుకవైపు ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. వీటిలో 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దాంతో రెండు హెల్మెట్‌లను పెట్టుకోవచ్చు.

Also Read: Maruti Suzuki Cars Offers 2023: మారుతి కార్లపై బంపర్ ఆఫర్.. రూ.50,000 వరకు తగ్గింపు! 3 కార్లపై భారీ డిస్కౌంట్  

Also Read: Kakinada Oil Factory: కాకినాడలో తీవ్ర విషాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News