8 Seater cars: 7 సీటర్ వద్దిక, అందుబాటులో 8 సీటర్ కార్లు , 13 లక్షల నుంచి ప్రారంభం

8 Seater cars: దేశంలో గత కొద్దికాలంగా 7 సీటర్, ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మీరు కూడా 7 సీటర్ కారు కొనే ఆలోచనలో ఉంటే మీకోసం అదే ధరకు 8 సీటర్ కారు అందిస్తున్నాం. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2023, 03:08 PM IST
8 Seater cars: 7 సీటర్ వద్దిక, అందుబాటులో 8 సీటర్ కార్లు , 13 లక్షల నుంచి ప్రారంభం

8 Seater cars: ఇండియాలో ఇప్పుడు 5 సీటర్ కంటే 7 సీటర్ కార్లకే డిమాండ్ అధికంగా ఉంది. లేదా ఎస్‌యూవీ కార్లంటే మోజు ఎక్కువగా కన్పిస్తోంది. అదే సమయంలో కొన్ని కంపెనీలు 7 సీటర్ కార్ల ధరకే 8 సీటర్ కార్లు అందిస్తూ కస్టమర్లకు ఆకట్టుకుంటున్నాయి. దేశంలో లభిస్తున్న 8 సీటర్ కార్ల గురించి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం..

మహీంద్ర మరాజో గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ కారు ధర 13.71 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇదొక అద్భుతమైన ఎంపీవీ. బిగ్ ఫ్యామిలీలకు అత్యంత అనువుగా ఉంటుంది. మహీంద్ర మరాజోలో 1.5 లీటర్ల డీజిల్ ఇంజన్ ఉంటుంది. 122 బీహెచ్‌పి, 300 న్యూటన్ మీటర్ టార్క్ జనరేట్ చేస్తుంది. దీంతోపాటు 6 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంది. లీటర్ కు 17.3 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుంది. 

టొయోటా ఇన్నోవా క్రిస్టా. ఈ కారు ధర 19.99 లక్షల నుంచి ప్రారంభమౌతంది. దేశంలోని ఎంపీవీ మోడల్స్‌లో టాప్ సెల్లింగ్ కారు ఇదే. ఇందులో 7-8 సీటర్ రెండూ ఉన్నాయి. ఇన్నోవా క్రిస్టాలో గతంలో రెండు ఇంజన్ ఆప్షన్లతో వచ్చేది. ఇప్పుడు ఇందులో కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే ఉంది. పెట్రోల్ ఇంజన్ కోసం ఇన్నోవా హైక్రాస్ ఉండనే ఉంది.

లెక్సస్ ఎల్ఎక్స్. 8 సీటర్ కార్లలో మరో ప్రత్యామ్నాయం లెక్సస్ ఎల్ఎక్స్. అది సూపర్ పవర్‌ఫుల్ ఎస్ యూవీ. ఈ కారు ధర 2.82 కోట్లు మాత్రమే. ఉలిక్కిపడ్డారా. కారు అలా ఉంటుంది మరి. ఇందులో 8 సీటర్ సౌకర్యముంది. ఇందులో 5663 సిసి ఇంజన్  362 బీహెచ్‌పి, 530 ఎన్ఎం టార్గ్ జనరేట్ చేసే ఏర్పాటు ఉంది. దీంతోపాటు 8 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంది. ఈ కారు మైలేజ్ కూడా చాలా తక్కువ.  ఈ కారు కిలోమీటర్‌కు కేవలం 6.9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Also read: MCLR Rates: ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో మార్పులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News