Shikhar Dhawan Divorce Reason: మాజీ భార్య కారణంగా భారీగా నష్టపోయిన శిఖర్ ధావన్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..?

Shikhar Dhawan and Aesha Mukerji Story: తన మాజీ భార్య అయేషా నుంచి విడాకులు తీసుకున్న శిఖర్‌ ధావన్‌కు బిగ్‌ రిలీఫ్ లభించింది. కోట్ల రూపాయలు నష్టపోయినా.. మానసిక క్షోభ నుంచి విముక్తి లభించింది. ఆమెకు దాదాపు రూ.13 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 6, 2023, 02:05 PM IST
Shikhar Dhawan Divorce Reason: మాజీ భార్య కారణంగా భారీగా నష్టపోయిన శిఖర్ ధావన్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..?

Shikhar Dhawan and Aesha Mukerji Story: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ తన మాజీ భార్య అయేషా నుంచి వీడిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరికి బుధవారం కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయేషా కారణంగా మానసిక వేదనకు గురయ్యాయని.. ఆమె నుంచి విడాకులు కావాలని ధావన్ కోరగా.. పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు అందుకు సమర్థించి విడాకులకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తి హరీష్ కుమార్ అయేషా పై ధావన్ చేసిన ఆరోపణలన్ని వాస్తవమేనని అంగీకరించి.. విడాకులు మంజూరు చేశారు. ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకున్న నేపథ్యంలో పలు అంతర్గత విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయేషాను పెళ్లి చేసుకుని ధావన్ కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె కారణంగా ఎంతో మానసిన క్షోభను కూడా అనుభవించాడు. 

ఓ ఫ్రెండ్ ద్వారా శిఖర్, ఆస్ట్రేలియాలో బాక్సర్‌గా ఉన్న  అయేషాకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు స్నేహితులుగా ఉండగా.. ఆ తరువాత ప్రేమికులుగా మారారు. అప్పటికే అయేషాకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భర్తతో వీడిపోయింది. 2009లో శిఖర్‌-అయేషా నిశ్చితార్థం జరగ్గా.. 2012లో పెళ్లి జరిగింది. వీరిద్దరికి కొడుకు జొరవర్‌ పుట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. అయేషా శిఖర్ ధావన్ కంటే 10 ఏళ్లు పెద్దది. అయేషా ఇద్దరు కుమార్తెలు రియా, ఆలియాలను దత్తత తీసుకున్నాడు. తన కొడుకు జోరావర్‌తోపాటు వాళ్లను కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. వీరి వైవాహిక జీవిత కాలంలో రూ.13 కోట్లు అయేషాకు ధావన్ పంపినట్లు తెలుస్తోంది. ఇంటి ఖర్చుల నుంచి కొడుకు, కూతుళ్ల చదువుల వరకు అన్నీ ధావన్ చూసుకున్నాడు. శిఖర్ తన కుటుంబం కోసం ఆస్ట్రేలియాలో మూడు ఆస్తులను కూడా కొనుగోలు చేశాడు. వాటిలో రెండింటికి అయేషానే ఓనర్‌గా ఉంది.

బాక్సింగ్ వృత్తిని ఎప్పుడో వదిలేసిన అయేషా.. శిఖర్ పంపిన డబ్బులతో ఇన్నాళ్లు గడిపింది. పిల్లల పెంపకం కోసం ఆమె తన మొదటి భర్త నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా.. ముగ్గురు పిల్లలకు శిఖర్ క్రమం తప్పకుండా డబ్బు పంపేవాడు. అయితే ఇంత జరిగినా అయేషా తన కొడుకు శిఖర్‌ను కలవడానికి ఒప్పుకోలేదు. దీంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు ధావన్. కోట్లాది రూపాయలు పోయినా.. మానసికంగా హింస నుంచి శిఖర్ ధావన్ బయటపట్టాడు. అయితే ఇంత జరిగినా ఏకాభిప్రాయంతో విడాకుల కోసం ఆయేషా శిఖర్ నుంచి రూ.13 కోట్లు అడిగింది. ఆస్తుల యాజమాన్యం బదిలీకి కూడా ఆమె కండీషన్లు పెడుతోంది.  

Also Read: Mumbai Fire Incident: ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు  

Also Read: RBI Monetary Policy: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. స్థిరంగా రెపో రేటు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News