Bank Holidays in January 2023: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. జనవరిలో సెలవులు ఇవే..

Holiday List In January 2023: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్. వచ్చే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. ఏకంగా 14 రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యమైన పనులు ఉన్నవారు ముందే పూర్తి చేసుకోండి. ఏయే రోజుల్లో బ్యాంక్ సెలవులు అంటే..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2022, 06:13 PM IST
  • జనవరి నెలలో బ్యాంక్‌లకు 14 రోజులు సెలవులు
  • ముందే పనులు పూర్తి చేసుకోండి
  • బ్యాంక్ సెలవుల జాబితా ఇదే..
Bank Holidays in January 2023: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. జనవరిలో సెలవులు ఇవే..

Holiday List In January 2023: డిసెంబర్ నెల ముగియబోతుంది. కొత్త సంవత్సరం రాకకు సమయం ఆసన్నమవుతోంది. వచ్చే నెలలో చాలా బ్యాంకులకు సెలవులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నగదు లావాదేవీల నుంచి చెక్కులు, డ్రాఫ్ట్‌లు జమ చేయడం వరకు అనేక పనుల కోసం బ్యాంకులను సందర్శించాల్సిన వారు సెలవుల తేదీలను గుర్తుపెట్టుకోవాలి. బ్యాంకులకు సుదీర్ఘ సెలవుల కారణంగా సాధారణ ఖాతాదారులు చాలాసార్లు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజల సౌకర్యార్థం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది.

ఆర్బీఐ కొత్త సంవత్సర క్యాలెండర్ ప్రకారం.. జనవరి 2023లో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. జనవరి నెలలో బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన పనులు ఉంటే.. ముందుగానే దాన్ని పూర్తి చేసుకోవడం మంచిది. సెలవలు లిస్టు బట్టి బ్యాంక్ పనులకు సంబంధించి ప్లాన్ చేసుకోండి. బ్యాంకుల సెలవులు ఆయా రాష్ట్రాల్లో స్థానిక పండుగల ప్రకారం నిర్ణయిస్తారు.  

జనవరి 2023లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా 

  • 1 జనవరి 2023- ఆదివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్)
  • జనవరి 5, 2023- గురుగోవింద్ సింగ్ జయంతి
  • 8 జనవరి 2023- ఆదివారం
  • 11 జనవరి 2023- బుధవారం (మిషనరీ దినోత్సవం రోజున మిజోరంలో బ్యాంకులు బంద్)
  • 12 జనవరి 2023- గురువారం (స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బ్యాంకులకు హాలీ డే)
  • 14 జనవరి 2023 - మకర సంక్రాంతి (రెండవ శనివారం)
  • జనవరి 15 -పొంగల్ ఆదివారం (అన్ని రాష్ట్రాలకు సెలవు)
  • జనవరి 22, 2023- ఆదివారం
  • జనవరి 23, 2023- సోమవారం - (నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అస్సాంలో బ్యాంకులకు సెలవు)
  • జనవరి 25, 2023-బుధవారం - (రాష్ట్ర దినోత్సవం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు ఉంటుంది)
  • జనవరి 26, 2023 - గురువారం - (గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సేవలు బంద్)
  • జనవరి 28, 2023 - నాల్గవ శనివారం
  • జనవరి 29, 2023-ఆదివారం
  • జనవరి 31, 2023 - మంగళవారం - (మి-డమ్-మి-ఫీ కారణంగా అస్సాంలో బ్యాంకులకు సెలవు) 

Also Read: 7th Pay Commission: 18 నెలల పెండింగ్ డీఏపై కేంద్రం కీలక ప్రకటన.. రాజ్యసభలో ఏం చెప్పిందంటే..  

Also Read: CM Jagan: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News