Bank Working Days: బ్యాంకులు పని చేసేది ఐదు రోజులే.. అప్పుడే కీలక నిర్ణయం..!

Bank News Update: బ్యాంక్ ఉద్యోగుల కల నెరవేరనుంది. ఎప్పుటి నుంచో ఎదురు చూస్తున్న ఐదు రోజుల పని దినాల డిమాండ్‌కు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఐబీఏ, ఐఎఫ్‌బీయూ సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 22, 2023, 03:09 PM IST
Bank Working Days: బ్యాంకులు పని చేసేది ఐదు రోజులే.. అప్పుడే కీలక నిర్ణయం..!

Bank News Update: బ్యాంక్‌ ఉద్యోగులకు అతి త్వరలోనే గుడ్‌న్యూస్ రాబోతుంది. వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రెండు, నాలుగు శనివారాలు సెలవులు ఉండగా.. ఇక నుంచి అన్ని శనివారాలు కూడా సెలవులు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 28వ తేదీన ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుసుకునే అవకాశం కనిపిస్తోంది.  

గతంలో జరిగిన సమావేశంలోనే 5 రోజులు పని చేసే విషయంపై చర్చించారు. ఈ విషయం పరిశీలనలో ఉందని ఐబీఏ తెలిపింది. ఈ విధానం అమలు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)లో ప్రభుత్వం ఐదు పనిదినాల నిబంధనను అమలు చేసిన తర్వాత.. బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల విధులు నిర్వహించే అంశంపై తెరపైకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పించాలన్న యూబీఎఫ్‌యూ డిమాండ్‌పై తమకు అభ్యంతరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే వెల్లడించింది. దీంతో వారానికి రెండు రోజులు సెలవులు కల్పించే విషయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది.

ప్రస్తుతం ఆదివారాలతోపాటు రెండు, నాలుగో శనివారాల్లో బ్యాంకులకు సెలవు దినాలు ఉన్నాయి. కొత్త విధానం అమలు చేస్తే.. ప్రతి నెల మొదటి, మూడో, ఐదో శనివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అంటే బ్యాంకుల్లో వారానికి ఐదు పనిదినాలు అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు ప్రతి వారం సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తారు. 

అయితే 5 రోజుల పని ప్రతిపాదన అమలు అయితే.. ఉద్యోగుల రోజువారీ టైమింగ్ పెరగనుంది. రోజువారీ పని గంటలలో 40 నిమిషాలు అధికంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 28న జరిగే సమావశంలో ఐదు రోజుల పనిదినాలతోపాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తమకు ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని చాలా రోజులుగా బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జూలై 28న ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్  

Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News