Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

Bajaj Cng Bike Price: ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్‌ సైకిల్‌ని లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 14, 2024, 10:31 AM IST
Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

 

Bajaj Cng Bike Price: ప్రస్తుతం మార్కెట్‌లో CNG కార్లు, మోటర్‌ సైకిల్స్‌కి ప్రత్యేకమైన డిమాండ్‌ ఉంది. దీని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ కొత్త కొత్త కార్లను, మోటర్‌ సైకిల్స్‌ను తయారు చేస్తున్నాయి. అయితే అతి త్వరలోనే ప్రముఖ మోటర్‌ సైకిల్ కంపెనీ బజాన్‌ గుడ్‌ న్యూస్‌ తెలిపబోతోంది. వీలైనంత త్వరలోనే బజాజ్‌ కంపెనీ దేశంలోని తొలి CNG మోటర్‌ సైకిల్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఈ విషయాన్ని ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈ బైక్‌ను కంపెనీ పెట్రోల్‌ వేరియంట్‌ కంటే అతి తక్కువ ధరనే లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బైక్‌ పెట్రోల్‌ కంటే ఎక్కువ మైలేజీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే డెడ్‌ ఛీప్ ధరలో లభించే  హీరో స్ప్లెండర్ వంటి మోడల్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బజాజ్‌ త్వరలోనే లాంచ్‌ చేయబోయే బైక్‌ పూర్తి వివరాలు, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

బజాజ్ CNG మోటార్‌సైకిల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
బజాజ్ ప్లాటినా మరియు CT మోటార్‌సైకిళ్లను కలిగి ఉంది, ఇవి ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజీని అందిస్తాయి. దీని ARAI ధృవీకరించబడిన పరిధి 70Km/l. వీటి కంటే సిఎన్‌జి బైక్ మైలేజ్ ఎక్కువగా ఉంటుందని అంచనా. ఇది దాని కేటగిరీలో అత్యంత ఇంధన సామర్థ్య మోటార్‌సైకిల్ అవుతుంది. కంపెనీ తన సొంత కుటుంబానికి చెందిన మరో మోటార్‌సైకిల్ నుండి 110సీసీ ఇంజిన్‌ను తీసుకోవచ్చు. ప్లాటినా 110cc మరియు CT 110Xతో చూసినట్లుగా. పెట్రోల్‌పై, ఈ ఇంజన్ గరిష్టంగా 8.6 PS శక్తిని మరియు గరిష్టంగా 9.81 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ప్రముఖ మోటర్‌సైకిల్‌ కంపెనీ బజాజ్ లాంచ్‌ చేయబోయే CNG బైక్‌ బయో-ఫ్యూయల్ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రత్యేమైన స్విచ్‌లతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ బైక్‌ను CNG నుంచి పెట్రోల్‌ వేరియంట్‌గా మార్చుకోవడానికి ప్రత్యేకమైన సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ బైక్‌కి ట్యాంక్‌ను సీటు కింది భాగంలో అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ బైక్‌ కేజీ సిఎన్‌జికీ దాదాపు 100 నుంచి 120 కిమీల వరకు మైలెజీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

బజాజ్‌ కంపెనీ మొదటి సంవత్సరంలో 1 నుంచి 1.20 లక్షల CNG బైకులను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి సంవత్సరంలో రెండు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. అయితే ఈ బైక్‌ల ధర రూ.1 లక్షకు పైగా ఉండే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటి తయారీ ప్రక్రియలను కూడా కంపెనీ గతంలోనే స్టార్ట్‌ చేసిన్నట్లు సమాచారం. వీటిని కంపెనీ ఔరంగాబాద్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ వీటికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను అధికారికంగా వెల్లడించలేదు. 

ఫీచర్స్‌:
17-అంగుళాల వీల్స్‌
80/100 ట్యూబ్‌లెస్ టైర్లు
డిస్క్, వెనుక డ్రమ్ కాంబో
ABS, నాన్-ABS వేరియంట్లు
గేర్ ఇండికేటర్, గేర్ గైడెన్స్ 
ABS ఇండికేటర్
స్పై షాట్‌లలో LED హెడ్‌లైట్స్‌
గేర్ ఇండికేటర్, గేర్ గైడెన్స్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News