Bajaj Chetak Electric Scooter 35 Series: విద్యుత్ వాహనాలు రోడ్లపైకి పరుగులు పెడుతున్నాయి. ఈవీ విప్లవం రావడంతో వాహనదారుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే బజాజ్ కంపెనీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. పాతకాలంలో దశాబ్దాలుగా కంపెనీకి విశేషంగా పేరు తీసుకువచ్చిన చేతక్ బండి రూపంలో సరికొత్తగా విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. చేతక్.. స్కూటీలను కలబోసి ఈవీ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో బజాజ్ విడుదల చేసింది. చేతక్ ఈవీ 35 సిరీస్ పేరిట విడుదల చేసిన వాహనాల ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
Also Read: Harish Rao: ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల.. కేటీఆర్‌కు తొలి విజయం
పాత చేతక్ ఈవీ మాదిరిగా తాజాగా కొత్త క్లాసిక్ లుక్‌తో చేతక్ 35 సిరీస్‌ను బజాజ్ సంస్థ విడుదల చేసింది. ఈ సిరీస్‌లో 3501, 3502 రెండు వెర్షన్లను బజాజ్ తీసుకువచ్చింది. చేతక్ 35 సిరీస్ 3501 అనేది ప్రీమియం మోడల్ కాగా దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.27 లక్షలు ఉంది. చేతక్ 35 సిరీస్ 3502 అనేది వెర్షన్‌కు రూ.1.20 లక్షలుగా ధర నిర్ణయించింది. పేర్కొన్న ధర బెంగళూరు ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. మరో వెర్షన్ 3503 మోడల్‌ను త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Also Read: KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ అరెస్ట్‌కు పది రోజులు బ్రేక్
ఫీచర్లు ఇవే
- బ్యాటరీ సామర్థ్యం: 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 4 కేడబ్ల్యూ మోటర్‌ను అమర్చారు.
- టాప్ స్పీడ్: ఈ స్కూటర్ 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.
- చార్జింగ్ కెపాసిటీ: ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 153 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది.
- ఛార్జింగ్‌కు పట్టే సమయం: బ్యాటరీ 3 గంట్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
- డిస్ప్లే: 5 అంగుళాల టచ్ టీఎఫ్టీ డిస్ప్లే. మ్యాప్స్‌తోపాటు ఫోన్లు ఆన్సర్ చేయడం.. రిజెక్ట్ చేయడం.. మ్యూజిక్ కంట్రోల్ సదుపాయం.
- ఇతర ఫీచర్లు: జియో ఫెన్స్, థెఫ్ట్ అలర్ట్ (దొంగతనం అలర్ట్), ప్రమాద హెచ్చరిక, ఓవర్‌స్పీడ్ అలర్ట్ వంటి భద్రతపరమైన ఫీచర్లు కల్పించారు.
- రంగులు: మొత్తం ఐదు రంగుల్లో ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎరుపు, పింక్, నీలి, నలుపు రంగుల్లో చేతక్ ఈ వాహనాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter