Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!

CNG Bikes in India: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను ఉపశమనం కలిగించేందుకు బజాజ్ సరికొత్త ప్లాన్ వేస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే సీఎన్‌జీ బైక్‌లను తీసుకువచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు ఆ కంపెనీ హింట్ ఇచ్చింది. ఈ బైక్‌లు మార్కెట్‌లోకి వస్తే.. ఇంధనం ఖర్చులు 50 శాతం వరకు తగ్గనున్నాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 20, 2023, 07:33 AM IST
Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!

CNG Bikes in India: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. పెట్రోల్ రేట్లు పెరగడంతో ఎక్కువ మైలేజీ వచ్చే వాహనాల వైపు ద్విచక్ర వాహనదారులు చూస్తున్నారు. ప్రస్తుతం సీఎన్‌జీతో కార్లు, ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. బైక్‌ల విషయంలో పెట్రోల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. కానీ సీఎన్‌జీతో నడిచే బైక్‌లు ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలోనే బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఎంట్రీ లెవల్ సీఎన్‌జీ బైక్‌పై సంకేతాలు ఇచ్చారు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 100 సీసీ సెగ్మెంట్‌ ఈవీ నుంచి తీవ్రమైన పోటీ నెలకొందన్నారు. రానున్న ఫెస్టివల్ సీజన్స్‌లో ఎక్కువ మంద ఎలక్ట్రిక్ బైక్స్‌కు మొగ్గుచూపుతారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

బజాజ్ తన విక్రయాలలో 70 శాతం కంటే ఎక్కువ 125 సీసీ కంటే ఎక్కువ బైక్‌లను కలిగి ఉందని ఆయన తెలిపారు. కంపెనీ 100- 125 సీసీ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో  ఏడు బైక్ మోడళ్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలు, కరోనా మహమ్మారి తరువాత ఉద్యోగాల కోల్పోవడంతో ఈ సెగ్మెంట్‌లో ఎక్కువ విక్రయాలు జరగట్లేదని చెప్పారు. సీఎన్‌జీతో నడిచే బైక్‌లు ఎందుకు ఉండకూడదని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈవీలవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నా.. కొంత ఆందోళన నెలకొందన్నారు. సెక్యూరిటీ, రేంజి, చార్జింగ్, బ్యాటరీ లైఫ్‌ విషయంలో అనుమానాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వారికి సీఎన్‌జీ బైక్‌లు ఒక మంచి ఎంపికగా మారుతాయని చెప్పుకొచ్చారు.

సీఎఎన్‌జీ బైక్‌ల గురించి తన ప్రణాళికను చెబుతూ.. ప్రభుత్వ సహకారంతో బజాజ్‌ కంపెనీనే తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు రాజీవ్ బజాజ్. సీఎన్‌జీ వెహికల్స్‌పై జీఎస్టీ 18 శాతానికి తగ్గించాలని కేంద్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. త్వరలోనే పల్సర్‌ మోటార్‌ సైకిల్‌కు ఆరు కొత్త అప్‌గ్రేడ్స్‌తో పాటు.. అతిపెద్ద పల్సర్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అందరనీ కలిచివేస్తున్నా విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఇంధన ధరలు రూ.100 కంటే తక్కువగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్లు, బైక్‌లు కొనుగోలు చేసే వారు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మారుతున్న ట్రెండ్‌ని బట్టి.. కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల్లో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. సీఎన్‌జీతో నడిచే బైక్‌ను బజాజ్ విడుదల చేస్తే.. మార్కెట్‌లో సంచలనం సృష్టించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. ఈ బైక్‌ను విడుదల చేస్తే.. ఇంధన ధర సగానికి తగ్గుతుందని చెబుతున్నారు.

Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది  

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News