Atal Pension Yojana Scheme: నెలకు జస్ట్ రూ. 210 పెట్టుబడితో 5 వేలు పెన్షన్ వచ్చే మార్గం ఇదిగో

Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ యోజన పథకం కింద నెలకు కనీసం 1,000 రూపాయలు నుండి 5,000 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అందుకు అవసరమైన అర్హతలు ఏంటి, ఎలా ఈ స్కీమ్‌లో చేరాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Oct 17, 2022, 08:10 PM IST
  • ఎవరెవరు అటల్ పెన్షన్ యోజన పథకానికి అర్హులు
  • నెలకు రూ. 3 వేలు పెన్షన్ పొందడం ఎలా ?
  • పెన్షన్ మాత్రమే కాదు.. మరెన్నో లాభాలు
  • అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలు
Atal Pension Yojana Scheme: నెలకు జస్ట్ రూ. 210 పెట్టుబడితో 5 వేలు పెన్షన్ వచ్చే మార్గం ఇదిగో

Atal Pension Yojana Scheme: విశ్రాంత జీవితం హాయిగా గడిచిపోవాలంటే కనీస అవసరాలకు అనుగుణంగా డబ్బు అవసరం ఎంతో ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే నెలా నెలా తప్పనిసరిగా పెన్షన్ అందుతుంది కాబట్టి వారి విశ్రాంత జీవితానికి ఏ డోకా ఉండదు కానీ వయో భారంతో పనిచేయడం మానేసిన ప్రైవేటు ఉద్యోగులకే ఆర్థిక భద్రత కరువవుతుంది. అందుకే చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత తమ జీవితం ఎలా ఉంటుంది, కనీస అవసరాలు ఎలా వెళ్లదీయాలి అనే టెన్షన్ వెంటాడుతుంటుంది. అలాంటి వారి కోసమే ప్రభుత్వం వైపు నుంచే కాకుండా ప్రైవేటు సంస్థలు కూడా రిటైర్మెంట్ ప్లాన్స్ పేరిట ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అందులో ఒకటి ఈ అటల్ పెన్షన్ యోజన పథకం.

అటల్ పెన్షన్ యోజన పథకం కింద నెలకు కనీసం 1,000 రూపాయలు నుండి 5,000 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అందుకు అవసరమైన అర్హతలు ఏంటి, ఎలా ఈ స్కీమ్‌లో చేరాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరెవరు అటల్ పెన్షన్ యోజన పథకానికి అర్హులు
18 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు తమ భార్య పేరిట బ్యాంకులో కానీ లేదా పోస్ట్ ఆఫీసులో కానీ అటల్ పెన్షన్ యోజన పథకం కింద ఖాతా తెరవాల్సి ఉంటుంది. 2015లో అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభమైనప్పుడు ఉద్యోగ భద్రత లేని అసంఘిటిత రంగాల్లో పనిచేసే వారికి మాత్రమే దీనికి అర్హులుగా ఉండే వారు. కానీ ఆ తర్వాత పథకం నిబంధనలు సడలించి అన్ని వర్గాల వారికి ఈ పథకం ఫలాలు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంది. 

సాధారణంగా ఏ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో అయినా చిన్న వయస్సులో చేరితో తక్కువ ప్రీమియం లేదా తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందడం జరుగుతుంది. అలాగే అటల్ పెన్షన్ యోజన పథకం నియమ నిబంధనల ప్రకారం కూడా ఎంత త్వరగా ఈ స్కీమ్ లో చేరితే 60 ఏళ్ల తర్వాత అంత మేలు జరుగుతుంది.

నెలకు రూ. 3 వేలు పెన్షన్ పొందడం ఎలా ?
ఉదాహరణకు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరాలనుకునే ఒక వ్యక్తి భార్య వయస్సు 25 ఏళ్లు అనుకున్నట్టయితే.. అతడి భార్య పేరిట నెలకు 226 పెట్టుబడి పెడితే 60 ఏళ్ల తర్వాత ఆమెకు 3 వేలు రూపాయలు నెల వారీగా పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఆమె వయస్సు 39 ఏళ్లు అనుకున్నట్టయితే.. నెలకు 792 రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.

పెన్షన్ మాత్రమే కాదు.. 
ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అటల్ పెన్షన్ యోజన పథకం ఖాతాదారులు చనిపోతే.. వారి నామినికి రూ. 5.1 లక్షలు బీమా అందడంతో పాటు యధావిధిగా నెల నెల పెన్షన్ పొందే అవకాశం ఉంది.

అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలు
అటల్ పెన్షన్ యోజన పథకానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ పథకం కింద ఖాతాదారులుగా చేరి పెట్టుబడి పెట్టే వారికి ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సి కింద 1.5 లక్షల రూపాయల వరకు టాక్స్ బెనిఫిట్ ఉంటుంది. దురదృష్టవశాత్తుగా ఖాతాదారులు చనిపోయినా.. నామినిగా ఉన్న వారి కుటుంబసభ్యులకు పెన్షన్ ఫలాలు ( Pension Schemes) అందుతూనే ఉంటాయి. పైగా అటల్ పెన్షన్ యోజన పథకం అనేది గ్యారంటీ రిటర్న్స్ భద్రతతో కూడినది కావడం మరో ప్లస్ పాయింట్ అనే విషయం మర్చిపోవద్దు.

Also Read : Multibagger Stocks: దీపావళికి బంపర్ ఆఫర్, నెలరోజుల్లో రెట్టింపైన షేర్ ధర

Also Read : Credit Card Alert: క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ ఎలర్ట్, ఇక నుంచి ఆ బ్యాంకు కార్డులపై కొత్త ఛార్జీలు

Also Read : SBI Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంచిన ఎస్బీఐ, కొత్త వడ్డీ రేట్లు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News