iPhone 14 Features: యాపిల్ ఐఫోన్ 14 లాంచింగ్ ఎప్పుడు, కొత్త ఫీచర్‌తో అలరించనున్న ఐఫోన్ 14

iPhone 14 Features: ఐఫోన్ ప్రేమికులంతా ఐఫోన్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మార్కెట్‌లో రానున్న ఐఫోన్ 14లో సరికొత్త ఫీచర్ వస్తోంది. తొలిసారిగా ఈ ఫీచర్ ప్రవేశపెడుతుండటంతో ఆసక్తి ఎక్కువైంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 16, 2022, 10:12 PM IST
iPhone 14 Features: యాపిల్ ఐఫోన్ 14 లాంచింగ్ ఎప్పుడు, కొత్త ఫీచర్‌తో అలరించనున్న ఐఫోన్ 14

iPhone 14 Features: ఐఫోన్ ప్రేమికులంతా ఐఫోన్ 14 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో మార్కెట్‌లో రానున్న ఐఫోన్ 14లో సరికొత్త ఫీచర్ వస్తోంది. తొలిసారిగా ఈ ఫీచర్ ప్రవేశపెడుతుండటంతో ఆసక్తి ఎక్కువైంది. 

ఐఫోన్ ప్రేమికులంతా ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ సిరీస్‌లో ఇప్పటి వరకూ 13 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. త్వరలో భారతీయ మార్కెట్‌లో అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ నెలలో ఐఫోన్ 14 లాంచ్ కానుంది. ఈసారి లాంచ్ చేయనున్న ఐఫోన్ 14లో మరో కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకురానుంది. యూజర్లకు సరికొత్త అనుభూతిని కల్గించేందుకు హై ఎండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా అందించేందుకు యాపిల్ సంస్థ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. చైనా డిస్ట్రిబ్యూటర్లతో క్వాలిటీ సమస్యలు తలెత్తడంతో.. చైనా కంపెనీను కాదని..ఎల్‌జి ఇన్నోటెక్‌తో కలిసి పనిచేసేందుకు యాపిల్ సంస్థ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 

తొలిసారిగా ఫ్రంట్ కెమేరా ఆటోఫోకస్

యాపిల్ ఫోన్లలో తొలిసారిగా ఐఫోన్ 14 లో ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా ఆటోఫోకస్ సదుపాయం రానుంది. ఐఫోన్ 14 ఈసారి నాలుగు వేరియంట్లలో రానుంది. అన్నింటిలోనూ ఆటోఫోకస్ సౌలభ్యం ఉంటుంది. కెమేరాలో వైడర్ ఎఫ్ 1.9 ఎపర్చర్ ఉంటుంది. ఆటోఫోకస్ సౌలభ్యంతో వీడియోకాల్స్ కూడా హై క్వాలిటీతో ఉంటాయి. ఇప్పటికే ఎల్‌జి కంపెనీ ఐఫోన్ 14 కోసం ఫ్రంట్ కెమేరాల ఉత్పత్తి ప్రారంభించింది. 

మరోవైపు ఐఫోన్ 14లో మైక్రోసాఫ్ట్ సంస్థ ఆఫీస్ ఇన్‌సైడర్ అనే కొత్త ఫీచర్ ఇందులో జోడించింది. దీనివల్ల ఐఫోన్ స్క్రీన్ లాక్ అయినా..వర్డ్ డాక్యుమెంట్లు వినేందుకు వీలు కలుగుతుంది. ఇన్‌సైడర్ యాప్ కారణంగా..అవుట్‌లుక్‌కు పంపించిన పీడీఎఫ్ మెయిల్ ఎటాచ్‌మెంట్లను కూడా ట్రాక్ చేస్తుంది.

సరికొత్త ఫీచర్లు 

మరోవైపు  ఐఫోన్ 14లో యూజర్లకు ఉపయోగపడే యాపిల్ మ్యాప్‌లో ప్రత్యేక ఫీచర్ ప్రవేశపెడుతోంది. ఇది 3డి ల్యాండ్ మార్కింగ్‌తో పాటు మ్యాప్ ఆధారంగా వెళ్లిన ప్రదేశానికి ఎంత సమయం పట్టిందో తెలుసుకోవచ్చు. యూజర్లకు మరింత అనుభూతి కల్పించేందుకు పిక్చర్లను అందించనుంది. షేర్డ్ విత్ యు ఫోల్డర్ ద్వారా ఈమోజీలు, పిక్చర్లను భద్రపర్చుకోవచ్చు. మరోవైపు లైవ్ టెక్స్ట్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఫలితంగా ఫోటోలపై ఉండే టెక్స్ట్ నేరుగా కాపీ లేదా పేస్ట్ లేదా షేర్ చేసుకోవచ్చు. 

Also read: Vu Smart TV: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ. 26 వేలకే 'వీయూ' 43 ఇంచ్ టీవీ! ఏకంగా రూ. 20 వేల తగ్గింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News