Apple iPhone Offers: Apple iPhone 12, iPhone 13 మోడల్స్ పై ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్!

Apple iPhone Offers: యాపిల్ ఐఫోన్ కు సంబంధించిన ఐఫోన్ 12, 13 మోడల్స్ పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 50 వేలకు ఈ ఐఫోన్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 10, 2022, 01:06 PM IST
Apple iPhone Offers: Apple iPhone 12, iPhone 13 మోడల్స్ పై ఆన్ లైన్ లో భారీ డిస్కౌంట్!

Apple iPhone Offers: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ కు ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఈ బ్రాండ్ నుంచి మార్కెట్లో ప్రస్తుతం ఐఫోన్ 12తో పాటు ఐఫోన్ 13 మోడల్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ లో ప్రస్తుతం 64GB స్టోరేజ్ తో అందుబాటులో ఉన్న iPhone 12పై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. దీని ధర ఇప్పుడు రూ. 53,900 అమ్మకానికి ఉంది. 

ఐఫోన్ 13 మోడళ్లపై ప్రస్తుతం రూ. 12 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ మోడల్స్ లో నీలం, ఎరుపు రంగు ఐఫోన్స్ అమ్మాకానికి ఉన్నాయి. ఐఫోన్ 12 64GB స్టోరేజ్ మోడల్ పై కూడా వరుసగా రూ. 5 వేలు, రూ. 10 వేలు ఫ్లాట్ తగ్గింపు వర్తిస్తుంది. ఈ మోడల్ ఊదా, తెలుపు రంగులలో అందుబాటులో ఉంది. Apple కంపెనీకి చెందిన ఆన్‌లైన్ స్టోర్ ప్రకారం iPhone 12 అధికారికంగా 65,900 రూపాయలకు అందుబాటులో ఉంది.

Amazon iPhone 12 128GB స్టోరేజ్ మోడల్‌పై రూ. 11,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీంతో దీని ధర రూ. 59,900కి తగ్గింది. 128GB స్టోరేజ్ కలిగిన iPhone 12 అసలు ధర మార్కెట్లో రూ.70,900గా ఉంది.

ఈ ఐఫోన్స్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా రూ. 11,650 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. దీంతో పాటు రూ. 2 వేల వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. 

Also Read: Tesla’s Shanghai Plantచైనాలో భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఎలన్ మస్క్

Also Read: MTNL Recharge Plan: 49 రూపాయల రీఛార్జ్ తో 180 రోజుల వ్యాలిడిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News