Amazon Prime Day: అమెజాన్‌ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది.. ఇవాళ, రేపు ఆఫర్ల జాతర.. కస్టమర్స్‌కు పండగే..

Amazon Prime Day: ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో నేడు, రేపు అమెజాన్ ప్రైమ్ డే సేల్ అందుబాటులో ఉండనుంది. అన్ని రకాల వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 23, 2022, 11:36 AM IST
  • అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది
  • అన్ని రకాల వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు
  • ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు ఉందో ఇక్కడ తెలుసుకోండి
 Amazon Prime Day: అమెజాన్‌ ప్రైమ్ డే సేల్ వచ్చేసింది.. ఇవాళ, రేపు ఆఫర్ల జాతర.. కస్టమర్స్‌కు పండగే..

Amazon Prime Day Offers: కస్టమర్స్ కోసం కళ్లు చెదిరే ఆఫర్స్‌తో 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. పిల్లల ప్యాంపర్స్ మొదలు లగ్జరీ ఐటెమ్స్ వరకు ఎన్నో వస్తువులపై ఈ ఆఫర్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. రిటైల్ స్టోర్స్‌లో వెచ్చించే ధరలతో పోలిస్తే ఇక్కడ అన్ని రకాల వస్తువులు డెడ్ చీప్‌గా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌లో ఏకంగా 90 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఒకరకంగా ఈ ప్రైమ్ డే సేల్ కస్టమర్లకు పండగ లాంటిదేనని చెప్పాలి. అమెజాన్ అందిస్తున్న ప్రైమ్ డే సేల్‌లో ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆఫర్‌లో ఏయే స్మార్ట్ ఫోన్లు :

రెడ్‌మీ, రియల్‌మీ, శాంసంగ్, టెక్నో పొవా, వివో, ఒప్పో, లావా తదితర బ్రాండ్స్‌పై 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్‌లో భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ ద్వారా మీ ఫేవరెట్ బ్రాండ్స్‌పై దాదాపు 90 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. 

ల్యాప్‌టాప్స్‌పై 75 శాతం తగ్గింపు :

ల్యాప్‌టాప్స్, స్మార్ట్ వాచీలు, ట్యాబ్లెట్స్, హెడ్ ఫోన్స్, ఇతరత్రా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, యాసెసరీస్‌పై ఏకంగా 75 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్స్‌లో హెచ్‌పీ, డెల్, ఎల్‌జీ, లెనోవో, ఆసస్ తదితర బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ ద్వారా కొన్ని బ్రాండ్స్‌పై దాదాపు రూ.40 వేలు వరకు ఆదా అవుతుంది.

హోమ్, కిచెన్, ఫర్నీచర్ వస్తువులపై 70 శాతం తగ్గింపు :

గృహోపకరణాలకు సంబంధించిన అన్ని వస్తువులపై దాదాపు 70 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.79 విలువ చేసే వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే ఫర్నీచర్ వరకు ఈ ఆఫర్‌లో అతి చౌక ధరకే అందుబాటులో ఉన్నాయి. రైస్ కుక్కర్స్, వాటర్ ఫిల్టర్స్, గ్యాస్ స్టవ్స్, మస్కిటో బ్యాట్, మిక్సీలు, బెడ్ షీట్స్, హోమ్ డెకార్స్, హెమ్ ఫర్నీచర్ ఇలా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు :

స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు ఇతరత్రా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌పై 'అమెజాన్ ప్రైమ్ డే' సేల్‌లో 60 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎల్‌జీ, వైల్‌పూల్, శాంసంగ్,గోద్రేజ్, రెడ్‌మీ, ఎంఐ, వన్‌ప్లస్ తదితర బ్రాండ్స్‌కి చెందిన వస్తువులు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే :

కస్టమర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ కాకపోతే పెద్దగా వర్రీగా కావాల్సిన పనిలేదు. అమెజాన్ ప్రైమ్‌లో 30 రోజుల ఉచిత ట్రయల్‌ను పొందడం ద్వారా మీరు కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందవచ్చు. లేదా రూ.179 ప్యాక్‌తో నెల పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.  ప్రస్తుతం అమెజాన్ అందిస్తున్న ప్రైమ్ డే సేల్ లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఇవాళ, రేపు రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Also Read: Batasingaram Market: రైతన్నకు తీరని నష్టం.. బాటసింగారం మార్కెట్‌లో వరద నీటిలో కొట్టుకుపోయిన టన్నులకొద్ది పండ్లు...

Also Read: Srisailam Dam:జూలైలోనే నిండిన  శ్రీశైలం డ్యాం.. ఇవాళ   గేట్లు ఓపెన్.. పర్యాటకుల సందడి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News