RBI Fines Amazon Pay: ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ పే (ఇండియా) లిమిటెడ్‌పై బ్యాంకింగ్ సెక్టార్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3 కోట్లకు పైగా జరిమానా విధించింది. కంపెనీ కేవైసీనిబంధనలను పాటించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ నిబంధనలను అమెజాన్ పాటించడం లేదని పేర్కొంది. అమెజాన్ పే ఇండియాపై 3.06 కోట్ల రూపాయల పెనాల్టీ విధిస్తూ ప్రకటన విడుదల చేసింది.
2021న పీపీఐకి సంబంధించి జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్, కేవైసీకి సంబంధించి ఫిబ్రవరి 25, 2016న జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్‌ను కంపెనీ పాటించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది. దీని కారణంగా రూ.3,06,66,000 జరిమానా విధించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. పెనాల్టీ ఎందుకు విధించకూడదని ఆ కంపెనీకి ఆర్‌బీఐ నోటీసులు జారీ చేసింది.
అమెజాన్ పే ఇండియా ప్రతిస్పందన తర్వాత.. కంపెనీకి వ్యతిరేకంగా నిబంధనలను విస్మరించిన విషయం సరైనదని తేలిందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆ తరువాత ఆ సంస్థపై జరిమానా విధించాలని నిర్ణయించుకున్నట్లు ఆర్‌బిఐ తెలిపింది. చెల్లింపు, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 30 కింద పొందిన హక్కుల ఆధారంగా అమెజాన్‌పై పెనాల్టీని ఆర్‌బీఐ విధించింది. రెగ్యులేటరీ సమ్మతిలో లోపాన్ని గుర్తించిన తర్వాత చర్యలు తీసుకుంది. ఈ జరిమానాకు అమెజాన్ పే ఇండియా తన కస్టమర్‌లతో చేసిన ఒప్పందం లేదా లావాదేవీ చెల్లుబాటుతో సంబంధం లేదని ఆర్‌బీఐ తెలిపింది.
Also read: Bandi Sanjay: కవితమ్మా.. ముందు మీ అయ్యను నిలదీయ్.. వాళ్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్
Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook