Redmi Phone Offers: రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని భారీ ఆఫర్, 32 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 1250 రూపాయలకే

Redmi Phone Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో 32 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 250 నుంచి 1250 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. నమ్మలేకపోతున్నారా..అదెలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 10, 2022, 12:20 AM IST
Redmi Phone Offers: రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని భారీ ఆఫర్, 32 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 1250 రూపాయలకే

Redmi Phone Offers: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో 32 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 250 నుంచి 1250 రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. నమ్మలేకపోతున్నారా..అదెలాగంటే..

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్‌మి ఫోన్లు అందరికీ ఇష్టమే. అద్భుతమైన ఫీచర్లతో ఆకర్షణీయంగా కన్పిస్తుంటాయి. ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన Redmi K50i 5G ఫోన్‌పై ఇప్పుడు భారీ ఆఫర్, డిస్కౌంట్ నడుస్తోంది. కేవలం అమెజాన్‌లో మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రకారం 32 వేల రూపాయల ఖరీదైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 250 రూపాయల్నించి 1250 రూపాయలకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఆ ఆఫర్ ఎలాగంటే..

రెడ్‌మి కే50ఐ 5జి స్మార్ట్‌ఫోన్ అసలు ధర 31 వేల 999 రూపాయలు. 19 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 25 వేల 999 రూపాయలకు విక్రయిస్తున్నారు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్‌లో ఇస్తే 24 వేల వరకూ తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ధర అనేది మీ పాత ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి ఉంటుంది. లేటెస్ట్ మోడల్, కండీషన్ బాగుంటే పూర్తి ఆఫర్ 24 వేలు వర్తించవచ్చు. లేదా మోడల్ పాతదై ఉంటే ఎక్స్చేంజ్ ధర మారుతుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు ఎక్స్చేంజ్ పూర్తిగా వర్తిస్తే 24 వేల రూపాయలు తగ్గుతాయి. అంటే రెడ్‌మి కే 50 ఐ 5జి స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 2 వేల రూపాయలకే లభించనుంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగిస్తే..750 నుంచి 1750 రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే Redmi K50i 5G మీకు కేవలం 250 రూపాయల్నించి 1250 రూపాయలకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. 

Redmi K50i 5G స్మార్ట్‌ఫోన్ 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే తో వస్తుంది. 6జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోన్‌లో ఎలెక్సా వెసులుబాటు ఉంది. రేర్ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా,  8 మెగాపిక్సెల్ అల్ట్రై వైడ్ , 2 మెగాపిక్సెల్ మ్యాక్రో త్రిపుల్ కెమేరా ఉన్నాయి. 5080 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేకత. అమెజాన్ ఆఫర్ పీరియడ్ ఆగస్టు 10వ తేదీతో ముగుస్తోంది. అందుకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే.,త్వరపడండి.

Also read: Poco C31 Smartphone: అద్భుతమైన ఫీచర్లు 12 వేల ఫోన్ కేవలం..249 రూపాయలకే, ఎలాగంటే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News